AP: టమాటా పొలంలో భారీ వజ్రం లభ్యం..! | Farmer Found Diamond In Kurnool District, More Details Inside | Sakshi
Sakshi News home page

AP: టమాటా పొలంలో భారీ వజ్రం లభ్యం..!

Jul 29 2025 11:29 AM | Updated on Jul 29 2025 12:00 PM

Farmer Found Diamond in Kurnool District

తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం దిగువచింతలకొండలో ఓ యువతి టమాటా పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం లభించింది. దాన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఆదివారం రాత్రి పలువురు వ్యాపారులు వజ్రం కొనుగోలుకు ప్రయత్నించినా బేరం కుదరలేదు. ఎనిమిది క్యారెట్లు ఉన్న ఈ వజ్రాన్ని సోమవారం చెన్నంపల్లికి చెందిన వ్యాపారి రూ.13.50 లక్షలకు కొన్నాడు. 24 రోజుల క్రితం పెండేకల్లులో రూ.6.80లక్షలు, ఇప్పుడు డీసీకొండలో రూ.13.50లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవడం చాలా అరుదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement