రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టి వేధింపులు
వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకుని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు.
అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం మరోసారి ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరుపరుస్తారని తెలిసింది. ఈ సందర్భంగా కారుమూరి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తన కుమారుడిని అరెస్ట్ చేశారని.. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.


