పోరస్‌ లేబొరేటరీస్‌ని మూసేస్తూ ఉత్తర్వులు జారీ

Eluru Chemical Factory: Govt Issues Closed Company Akkireddygudem - Sakshi

సాక్షి, అమరావతి: ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడం పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అధికారులు జరిపిన దర్యాప్తులో ఫ్యాక్టరీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలింది. దీంతో ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఛైర్మన్‌ ఏకే ఫరీడ పోరస్‌ లేబొరేటరీస్‌ను మూసేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

కాగా.. పోరస్‌ లేబొరేటరీస్‌లో అర్థరాత్రి రియాక్టర్‌ పేలడంతో యూనిట్‌-4లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా వాతావరణ కాలుష్యం కూడా జరిగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top