Eenadu False Writings on Jagananna Videshi Vidya Deevena - Sakshi
Sakshi News home page

విదేశీ విద్యపైనా ‘ఈనాడు’ విషం

Jul 30 2023 4:59 AM | Updated on Aug 14 2023 10:53 AM

Eenadu false writings on Jagananna Videshi Vidya Deevena - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని రూపొందించేటప్పుడు లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, ఎంపికలో నిబంధనలను స్పష్టంగా పేర్కొంటుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యున్నత ప్రతిభావంతులకు రూ. కోటికి పైగా సాయం అందించే అద్భుత పథకం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’. ఈ పథకానికీ నిబంధనలు రూపొందించి పారదర్శకంగా అమలు చేస్తోంది. అది కూడా సంతృప్త స్థాయిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా రూపొందించిన పథకమిది.

ఈ పథకంతో రాష్ట్రానికి చెందిన అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు నోబెల్‌ గ్రహీతలకు నిలయమైన గొప్ప సంస్థల్లో చదువుకుంటున్నారు. టిమ్‌ కుక్, స్టీవ్‌ జాబ్స్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు చదువుకున్న విశ్వవిద్యాల యాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇదే ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. అవాస్తవా లతో ‘ఈనాడు’ పత్రిక ఓ విష కథనాన్ని ప్రచురించింది.

గత ప్రభుత్వంలో ఊరూ పేరూ లేని కొన్ని విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించడంతో పాటు నిబంధనలకు పాతరేసి నిధులను దోచుకున్నా పట్టించుకోని ఈ విష పత్రిక.. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిభ ఉన్నవారికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు, గుర్తింపు పొందిన గొప్ప యూనివర్సిటీల్లో చేరిన వారికి అవకాశాలు కల్పిస్తుంటే తప్పుగా చూపిస్తోంది. ప్రభుత్వ నిబద్ధతను, ఉన్నత ఆశయాలను దెబ్బతీసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా కథనాన్ని ఇచ్చింది. 

గతం కంటే పెరిగిన విదేశీ విద్యా సంస్థలు 
ప్రభుత్వం 2022 జూలై 11న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్యూఎస్‌/ టైమ్‌ ర్యాంకుల్లో ఉన్న 200 యూనివర్సిటీలనే తీసుకుంది. కానీ, ఎక్కువ మంది విద్యార్థులు ప్రయోజనం పొందేలా 21 కోర్సులకు సంబంధించి ప్రతి కోర్సుకు టాప్‌ 50లో ఉన్న విద్యా సంస్థలకూ వర్తింపజేసింది. దీంతో మొత్తం విద్యా సంస్థల సంఖ్య 320కి పెరిగింది. అంటే గతంలోకంటే 120 యూని వర్సిటీలు అధికంగా ఉన్నాయి.

పైగా విద్యా ర్థులు ఫలానా దేశంలోని యూనివర్సిటీ లకు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఏదీ విధించకుండా ఆ ర్యాంకింగ్‌లో ఉన్న ఏ విద్యా సంస్థకైనా వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. మరి విద్యా సంస్థలు ఎక్కడ తగ్గిపోయాయో రామోజీనే చెప్పాలి. గత ప్రభుత్వంలో విదేశీ విద్యా సంస్థల ఎంపికకు ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. ర్యాంకింగ్‌ను పట్టించుకోకుండా 15 దేశాల్లోని విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశమిచ్చారు. దాంతో విద్యార్థులు నాసి రకమైన సంస్థల్లో ప్రవేశాలు పొంది భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టుకున్నారు. 

బాబు పాలనలో ఫీజు రూ.15 లక్షలే.. ఇప్పుడు రూ.1.25 కోట్లు 
గత చంద్రబాబు ప్రభుత్వం విదేశాల్లో చదువు కునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గరి ష్టంగా రూ.15 లక్షల చొప్పున, ఓసీలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకొంది. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నూరు శాతం ఫీజు చెల్లిస్తోంది. ఓసీలకు రూ.కోటి, ఇతర వర్గాలకు రూ.1.25 కోట్లు వెచ్చిస్తోంది.

గత చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను, వర్గాన్నిబట్టి 100 నుంచి 500 మందికి మాత్రమే పరిమితం చేసింది. దాంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరిగింది. విద్యార్థుల ఎంపికలో   పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంది. విద్యార్థి కుటుంబ వార్షికాదాయ పరిమితిని కూడా రూ.6 లక్షల కు పరిమితం చేసింది. కుటుంబంలో ఒక్కరికే పథకం వర్తింపజేస్తూ నిబంధన పెట్టారు.

ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతిభావంతులు ఎందరున్నా వారందరికీ అవకాశం కల్పిస్తోంది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు పెంచింది.

గత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్‌ కార్డు రాగానే ఒకసారి, మొదటి సెమిస్టర్‌ పూర్తవగానే రెండోసారి ఫీజు చెల్లించి వదిలేసేది. తర్వాత విద్యార్థి ఏమయ్యాడో పట్టించుకోలేదు. పైగా 2016–17, 2018–19 సంవత్సరాల్లో 3,326 మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.318 కోట్లు ఎగ్గొట్టింది.దీంతో వారి తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపో యారు. చాలామంది విద్యార్థులు విదేశీ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిధుల దుర్వి నియో గానికి తావు లేకుండా విద్యార్థి సెమి స్టర్‌/ టర్మ్‌ పత్రాలు సమర్పించగానే ఆ నిధు లను విడుదల చేస్తోంది. ఈ మార్గదర్శ కాల్లో ఎలాంటి మార్పు లేకున్నా ఈనాడు పత్రిక మాత్రం నిధుల విడుదలకు అదనపు ఆంక్షలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. 

గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలులో జరిగిన తీవ్రమైన లోపాలు విజిలె న్స్‌ విచారణలో బయటపడ్డాయి. చాలా మంది విద్యార్థులు నిధులు మంజూరైన తర్వాత విద్యా సంస్థను మార్చే యగా,  మరికొంత మంది కోర్సును మధ్య లో ఆపేసి వచ్చేశారు. పథకానికి ఎంపికైన వారిలో కొందరు దరఖా స్తులో ఇచ్చిన చిరు నామాలో లేకపోవడం గమనార్హం. ఇప్పుడు ప్రతి విద్యార్థీ ఎక్కడ ఏ కోర్సు చదువుతు న్నారు, వారి చిరునామా, కుటుంబ వివరా లతో సహా పారదర్శకంగా పరిశీలిస్తున్నారు. 

357 మంది లబ్ధిదారులకు రూ.142.71 కోట్లు 
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద గత ఏడాది 290 మంది, ఈ ఏడాది 67 మందికి కలిపి రూ.142.71 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫిబ్రవరిలో లబ్ధిపొందిన 290 మందిలో ఎస్సీ విద్యార్థులు 27 మంది, బీసీలు 64 మంది, క్రిస్టియన్‌లు నలుగురు, ముస్లింలు 20 మంది, ఈబీసీలు 175 మంది ఉన్నారు.

2023–24 విద్యా సంవత్సరంలో ఫాల్‌ సీజన్‌ కింద ఎంపికైన 67 మందిలో ఎస్సీ విద్యార్థులు ఐదుగురు, ఎస్టీ ఒకరు, బీసీలు 13 మంది, క్రిస్టియన్‌లు నలుగురు, ముస్లింలు 8 మంది, ఈబీసీలు 36 మంది ఉన్నారు. 2022–23 బ్యాచ్‌ విద్యార్థులకు రెండో విడత వాయిదా ఫీజు, వీసా చార్జీలు, విమాన ఖర్చులతో సహా రూ.35.40 కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఈనాడు మాత్రం కేవలం ఐదుగురు ఎస్సీ, ఒక ఎస్టీ విద్యార్థులు మాత్రమే లబ్ధి పొందారని, బీసీ విద్యార్థులెవరికి ఈ పథకం వర్తించలేదని అబద్ధపు కథనం ప్రచురించింది.

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేద విద్యార్థులకు ఎంతగా మేలు చేస్తుందో చెప్పడానికి లబ్ధిపొందిన ఓ విద్యార్థి అధికారులకు రాసిన లేఖే ఉదాహరణ.. ఇదిగో లేఖ..

 ‘‘రెస్పెక్టెడ్‌ సర్, 
నా పేరు సుకుమార్‌ దొడ్డ. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా వణుకూరు గ్రామం నుంచి వచ్చాను. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మోనాష్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ చదువుతున్నా. వణుకూరులోనే పాఠశాల విద్య పూర్తి చేశాను. అండర్‌ గ్రాడ్యుయేట్‌ వరంగల్‌ ఎన్‌ఐటీలో చేశాను. మా నాన్న దినసరి కూలీ. అమ్మ గృహిణి. మా ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పటికీ, నాన్న నన్ను కష్టపడి చదవమని ప్రోత్సహించేవారు.

నేను విదేశాలలో మాస్టర్స్‌ చదవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ అవకాశం లేదని విరమించుకున్నాను. అదృష్టవశాత్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టడంతో నా కల మలుపు తిరిగింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు తోడ్పాటు నిచ్చింది. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్‌ 50 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేశాను.

ఎస్‌ఎల్‌సీ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ఈ పథకానికి ఎంపికయ్యా ను. 2023 జూలై 24 నుంచి క్లేటన్‌లోని మోనాష్‌ విశ్వవిద్యాలయంలో చదువుతు న్నాను. విదేశాలలో చదువుకో వాలనే నా కలను సాధ్యం చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను రూ.52 లక్షల స్కాలర్‌షిప్‌ కూడా ప్రభుత్వం నుంచి అందుకున్నాను, ఇది నా రెండేళ్ల ట్యూషన్‌ ఫీజు మొత్తం. ఈ ఉదారమైన స్కాలర్‌షిప్‌ నా కలను నెరవేర్చుకునేందుకు, నన్ను నేను నిరూపించుకునేందుకు దోహదపడింది.                                                                             కృతజ్ఞతలతో  – అసుకుమార్‌ దొడ్డ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement