ఫిష్‌ ఆంధ్ర అవుట్‌లెట్లలో డిజిటల్‌ పేమెంట్లు

Digital payments at Fish Andhra outlets Andhra Pradesh - Sakshi

పరికరాలను ఉచితంగా అందజేయనున్న పేటీఎం సంస్థ 

సాక్షి, అమరావతి: ‘ఫిష్‌ ఆంధ్ర’ పేరుతో ఏర్పాటు చేస్తోన్న రిటైల్‌ అవుట్‌లెట్లలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో పేటీఎం సంస్థతో రాష్ట్ర మత్స్యసహకార సంస్థ మంగళవారం ఒప్పందం చేసుకోనుంది.

విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మత్స్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మత్స్య శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు సమక్షంలో మత్స్యసహకార సంస్థ చైర్మన్‌ కె.అనిల్‌బాబు, పేటీఎం చీఫ్‌ బిజినెస్‌ మేనేజర్‌ అభయ్‌శర్మ ఒప్పందం చేసుకోనున్నారు.

ఒప్పందం మేరకు రూ.22 వేల విలువైన పాయింట్‌ ఆఫ్‌ సేల్, క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన పేమెంట్‌ ఆడియో సౌండ్‌ బాక్సులను పేటీఎం సంస్థ ఉచితంగా సమకూర్చనుంది. వీటిని ఫిష్‌ ఆంధ్ర యాప్‌తో అనుసంధానం చేస్తారు. ఒప్పందం మేరకు ఈ నెలాఖరుకల్లా  2వేల రిటైల్‌ అవుట్‌లెట్లలో పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన వాటికి కూడా అందజేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top