వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ధన్వంతరీ జయంతీ | Dhanvantari Jayanti celebrated at YSRCP central office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ధన్వంతరీ జయంతీ

Oct 18 2025 8:00 PM | Updated on Oct 18 2025 8:07 PM

Dhanvantari Jayanti celebrated at YSRCP central office
  • ధన్వంతరీ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్దలతో పూజలు
  • సమాజానికి ధన్వంతరీ అందించిన ఔషదసేవలను స్మరించుకున్న పార్టీ నేతలు
  • ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు సత్కారం
  • వైఎస్‌ జగన్ పాలనలోనే నాయీబ్రాహ్మణులకు మేలు
  • ఏడాదికి రూ.10 వేల చొప్పున 50 వేల సెలూన్‌లకు ఆర్థిక చేయూత
  • సెలూన్‌లకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించారు
  • ఆలయ పాలకమండళ్ళలో నాయీబ్రాహ్మణులకు స్థానం కల్పించారు
  • వృత్తి కులాల అభివృద్దికి చిత్తశుద్దితో కృషి చేసిన వైఎస్‌ జగన్
  • వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి

తాడేపల్లి  వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో MLC పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జ్ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య నారాయణుడు ధన్వంతరీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ ధన్వంతరీ చిత్రపటానికి పూలమాలలు వేసి, సంప్రదాయ సిద్దంగా భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు నేతలు భగవాన్ ధన్వంతరీ సమాజానికి అందించిన ఔషద సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వక్తల ప్రసంగించారు.

నాయీబ్రాహ్మణులకు వైఎస్సార్‌సీపీ హయాంలోనే సముచిత గౌరవం
-లేళ్ల అప్పిరెడ్డి
వైద్యనారాయణుడు ధన్వంతరీ భగవన్ జయంతిని వైఎస్సార్‌సీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. మానవుల ఆనారోగ్యాన్ని తొలగించి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదానికి ఆధ్యుడు భగవాన్ ధన్వంతరీ. ఆయన అందించిన జ్క్షానాన్ని నాయీబ్రాహ్మణులు అందుకుని, ఈ సమాజానికి ఎనలేని సేవలు అందించారు. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్యులు లేని సమయంలో నాయీబ్రాహ్మణులే తమ వైద్య విజ్క్షానంతో చికిత్సలు చేసేవారు. మానవ నాగరికతలో నాయీబ్రాహ్మణులది కీలకపాత్ర. 

తరువాత కాలంలో వారిలో అనేకులు ఆర్‌ఎంపీలు, పీఎంపీలుగా మారి గ్రామీణ ప్రాంతాల్లో అమూల్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో సీఎంగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన పాలనలో వీరి సేవలను గుర్తించి వారికి వృత్తిశిక్షణను అందించి, సర్టిఫికేట్లు ఇచ్చి మరీ ప్రోత్సహించారు. ఆయన తనయుడు వైఎస్‌ జగన్ సీఎంగా నాయీబ్రాహ్మణుల అభ్యున్నతికి పాటుపడ్డారు. విద్యకు ప్రాధానత్య ఇచ్చి అణగారిన కులాలకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేశారు. కులవృత్తుల్లో ఉన్న నాయీబ్రాహ్మణులకు ఏడాదికి రూ.10    వేలు, సెలూన్‌లకు నెలకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను అంఆదించారు. పాలక మండళ్ళలో నాయీబ్రాహ్మణులకు స్థానం కల్పించారు. 

ఆలయాల ప్రతిష్టను మరింత పెంచే క్రమంలో నాయీబ్రాహ్మణుల పాత్రకు ఉన్న ప్రాధాన్యతను ఆయన చాటిచెప్పారు. ధన్వంతరీ జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో జీఓను జారీ చేసే సమయంలోనే ఎన్నికలు రావడం వల్ల అది సాధ్యపడలేదు. మళ్లీ వైఎస్‌ జగన్ సీఎం అయిన తరువాత భగవాన్ ధన్వంతరీ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు తప్పకుండా జారీ చేస్తారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయీబ్రాహ్మణులకు మేలు చేయకపోగా, తమ సమస్యలను చెప్పడానికి వెడితే 'తోకలు కట్ చేస్తాను' అంటూ బెదిరించిన సంఘటనలను చూశాం. ఇటువంటి పరిస్థితులు మారాలంటే మళ్లీ బీసీలకు సముచిత గౌరవం ఇచ్చే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావాలి.  

సమాజానికి భగవాన్ ధన్వంతరీ ఆరోగ్యాన్ని ప్రసాదించారు
-టీటీడీ మాజీ సభ్యుడు యానాదయ్య
ధనత్రయోదశి నాడు ప్రతి ఏటా ప్రజలు భగవాన్ ధన్వంతరీ జయంతిని జరుపుకుంటారు. నాయీబ్రాహ్మణులు తమ కులదైవంగా భగవాన్ ధన్వంతరీ ప్రసాదించిన ఔషదసేవలను తమ వృత్తిలో భాగంగా ప్రజలకు అందించారు. మన పురాణాల ప్రకారం పాలసముద్రంను చిలికిన సందర్భంగా ఆయుర్వేద ఔషద కలశంతో భగవాన్ ధన్వంతరీ ఆవిర్భవించారు. అప్పటి నుంచి ఆయన ప్రజల ఆరోగ్యాలను కాపాడే అపర వైద్య నారాయణుడుగా మానవాళికి మహోపకారం చేశారు. అలాగే మానసిక ఉల్లాసం, మానసిక రుగ్మతలను శబ్ధవాయిధ్యాలతో పారద్రోలో కళను కూడా నాయీబ్రాహ్మణులకు ప్రసాదించారు. చివరికి భగవంతుడిని మేల్కొలిపే అరుదైన అవకాశాన్ని కూడా వాయిద్యకారులైన నాయీబ్రాహ్మణులకు అనుగ్రహించాడానికి భగవాన్ ధన్వంతరీ ఆశీస్సులే కారణం.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ  వైద్యుల సేవాసంఘం ఆనంద్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, RMP వైద్యులు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రాజ్‌కుమార్, వెంకటసుబ్బయ్య, మాధవరావు, మురళీ తదితరులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణసంఘం కార్పోరేషన్ మాజీ డైరెక్టర్లు మల్కాపురం కనకారావు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రకాశ్, ఆలయ పాలకమండలి మాజీ సభ్యురాళ్ళు రామలక్ష్మమ్మ, నందిని, AGL.నారాయణ, పొదిలి సత్యం, ద్రోణాదుల రామకృష్ణ ,గ్రీవెన్స్ సెల్ నారాయణ మూర్తి, పిల్లుట్ల మోహన్‌రావు ఇతర  నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement