breaking news
Dhanvantari jayanti
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ధన్వంతరీ జయంతీ
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో MLC పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్చార్జ్ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య నారాయణుడు ధన్వంతరీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ ధన్వంతరీ చిత్రపటానికి పూలమాలలు వేసి, సంప్రదాయ సిద్దంగా భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు నేతలు భగవాన్ ధన్వంతరీ సమాజానికి అందించిన ఔషద సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వక్తల ప్రసంగించారు.నాయీబ్రాహ్మణులకు వైఎస్సార్సీపీ హయాంలోనే సముచిత గౌరవం-లేళ్ల అప్పిరెడ్డివైద్యనారాయణుడు ధన్వంతరీ భగవన్ జయంతిని వైఎస్సార్సీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. మానవుల ఆనారోగ్యాన్ని తొలగించి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదానికి ఆధ్యుడు భగవాన్ ధన్వంతరీ. ఆయన అందించిన జ్క్షానాన్ని నాయీబ్రాహ్మణులు అందుకుని, ఈ సమాజానికి ఎనలేని సేవలు అందించారు. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్యులు లేని సమయంలో నాయీబ్రాహ్మణులే తమ వైద్య విజ్క్షానంతో చికిత్సలు చేసేవారు. మానవ నాగరికతలో నాయీబ్రాహ్మణులది కీలకపాత్ర. తరువాత కాలంలో వారిలో అనేకులు ఆర్ఎంపీలు, పీఎంపీలుగా మారి గ్రామీణ ప్రాంతాల్లో అమూల్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో సీఎంగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన పాలనలో వీరి సేవలను గుర్తించి వారికి వృత్తిశిక్షణను అందించి, సర్టిఫికేట్లు ఇచ్చి మరీ ప్రోత్సహించారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా నాయీబ్రాహ్మణుల అభ్యున్నతికి పాటుపడ్డారు. విద్యకు ప్రాధానత్య ఇచ్చి అణగారిన కులాలకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేశారు. కులవృత్తుల్లో ఉన్న నాయీబ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు, సెలూన్లకు నెలకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను అంఆదించారు. పాలక మండళ్ళలో నాయీబ్రాహ్మణులకు స్థానం కల్పించారు. ఆలయాల ప్రతిష్టను మరింత పెంచే క్రమంలో నాయీబ్రాహ్మణుల పాత్రకు ఉన్న ప్రాధాన్యతను ఆయన చాటిచెప్పారు. ధన్వంతరీ జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో జీఓను జారీ చేసే సమయంలోనే ఎన్నికలు రావడం వల్ల అది సాధ్యపడలేదు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత భగవాన్ ధన్వంతరీ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు తప్పకుండా జారీ చేస్తారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయీబ్రాహ్మణులకు మేలు చేయకపోగా, తమ సమస్యలను చెప్పడానికి వెడితే 'తోకలు కట్ చేస్తాను' అంటూ బెదిరించిన సంఘటనలను చూశాం. ఇటువంటి పరిస్థితులు మారాలంటే మళ్లీ బీసీలకు సముచిత గౌరవం ఇచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాలి. సమాజానికి భగవాన్ ధన్వంతరీ ఆరోగ్యాన్ని ప్రసాదించారు-టీటీడీ మాజీ సభ్యుడు యానాదయ్యధనత్రయోదశి నాడు ప్రతి ఏటా ప్రజలు భగవాన్ ధన్వంతరీ జయంతిని జరుపుకుంటారు. నాయీబ్రాహ్మణులు తమ కులదైవంగా భగవాన్ ధన్వంతరీ ప్రసాదించిన ఔషదసేవలను తమ వృత్తిలో భాగంగా ప్రజలకు అందించారు. మన పురాణాల ప్రకారం పాలసముద్రంను చిలికిన సందర్భంగా ఆయుర్వేద ఔషద కలశంతో భగవాన్ ధన్వంతరీ ఆవిర్భవించారు. అప్పటి నుంచి ఆయన ప్రజల ఆరోగ్యాలను కాపాడే అపర వైద్య నారాయణుడుగా మానవాళికి మహోపకారం చేశారు. అలాగే మానసిక ఉల్లాసం, మానసిక రుగ్మతలను శబ్ధవాయిధ్యాలతో పారద్రోలో కళను కూడా నాయీబ్రాహ్మణులకు ప్రసాదించారు. చివరికి భగవంతుడిని మేల్కొలిపే అరుదైన అవకాశాన్ని కూడా వాయిద్యకారులైన నాయీబ్రాహ్మణులకు అనుగ్రహించాడానికి భగవాన్ ధన్వంతరీ ఆశీస్సులే కారణం.ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సేవాసంఘం ఆనంద్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, RMP వైద్యులు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రాజ్‌కుమార్, వెంకటసుబ్బయ్య, మాధవరావు, మురళీ తదితరులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణసంఘం కార్పోరేషన్ మాజీ డైరెక్టర్లు మల్కాపురం కనకారావు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రకాశ్, ఆలయ పాలకమండలి మాజీ సభ్యురాళ్ళు రామలక్ష్మమ్మ, నందిని, AGL.నారాయణ, పొదిలి సత్యం, ద్రోణాదుల రామకృష్ణ ,గ్రీవెన్స్ సెల్ నారాయణ మూర్తి, పిల్లుట్ల మోహన్‌రావు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?
శ్రీ మహావిష్ణువు అవతారంగా, దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేద వైద్యానికి ఆది వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన ధన్వంతరి క్షీర సాగర మథన సమయాన ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. చతుర్భుజుడైన ధన్వంతరి నాలుగు చేతులలో శంఖం, చక్రం, జలౌకం (జలగ) అమృత తుల్యమైన పునరుజ్జీవన తేనె భాండం దర్శనమిస్తాయి.ధన్వంతరిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజిస్తున్నప్పటికీ, ధన్వంతరికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. ఆ ఉన్న కొద్ది ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే దర్శనమిస్తాయి ఉత్తర భారతాన న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఒక విగ్రహం, హరిద్వార్‌లోని ఒక ఆశ్రమంలో మరొక విగ్రహం తప్ప ఉత్తర భారతాన ధన్వంతరికి ఆలయాలంటూ అసలేం లేవనే చెప్పాల్సి ఉంటుంది.రంగనాథస్వామి ఆలయం వద్ద ధన్వంతరి ఆలయంతమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన పురాతన మందిరం ఉంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఆరోగ్యాభిలాషులైన భక్తులకు ‘ప్రసాదం’గా మూలికలను అందిస్తారు.కోయంబత్తూరు శ్రీ ధన్వంతరి ఆలయంకోయంబత్తూరులోని శ్రీ ధన్వంతరి ఆలయం తమిళనాడులోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. కోయంబత్తూరు నగర నడిబొడ్డున ఆర్య వైద్య చికిత్సాలయం, పరిశోధనా సంస్థలో ఉన్న శ్రీ ధన్వంతరి మందిరం, జీవానికి, వైద్యానికి దేవుడు, ధన్వంతరిని ప్రధాన దేవతగా ప్రతిష్టించింది.నెల్లువాయ భగవాన్ ధన్వంతరి ఆలయంగురువాయూర్, త్రిసూర్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయ వద్ద ఉన్న లార్డ్ ధన్వంతరి ఆలయం కేరళలోని ముఖ్యమైన ధన్వంతరి ఆలయాలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు వైద్యం ్ర΄ారంభించే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.మలప్పురంలో రుద్ర ధన్వంతరి ఆలయంమలప్పురంలోని పులమంథోల్ మధ్యలో ఉన్న శ్రీ రుద్ర ధన్వంతరి ఆలయం కేరళలోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ అష్టవైద్య పులమంథోల్ మూస్ కుటుంబానికి చెందినది, అయితే అన్ని వర్ణాలకు చెందిన హిందువులు ఆలయంలో పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంది.శ్రీ ధన్వంతరి ఆలయం, పెరింగవుకేరళలోని త్రిస్సూర్ పట్టణ శివార్లలో ఉన్న మరొక పురాతన ధన్వంతరి ఆలయం పెరింగావులోని శ్రీ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయ గర్భగుడి రెండు అంతస్తులతో గుండ్రని ఆకారంలో నిర్మించబడింది, ఇది ఇతర కేరళ శైలి నిర్మాణ శైలికి భిన్నంగా అరుదైన డిజైన్. గణపతి, లక్ష్మీదేవి, అయ్యప్పన్ ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన ఇతర దేవతలు.వడక్కంచెరి ధన్వంతరి ఆలయంవడక్కంచెరి ఆయుర్వేద ప్రభువుకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్‌కు ఉత్తరాన 18 కి.మీ దూరంలో వడక్కంచెరి నుండి 8 కి.మీ దూరంలో కున్నంకుళం – వడక్కంచెరి రహదారిపై ఉంది. (అక్టోబర్ 18, శనివారం ధన్వంతరి జయంతి) -
ధనత్రయోదశి ధగధగలు
ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే శుభదినం ధనత్రయోదశి. వెలుగు దివ్వెల పండుగ దీపావళికి రెండు రోజుల ముందు జరుపుకునేదీ ఈ ఉత్సవం. ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకలశుభాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ ధనత్రయోదశి నాడు శక్తికొలది బంగారం కొని లక్ష్మీదేవిని సేవిస్తారు. ఈ నేపథ్యంలో బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. సాక్షి, విజయవాడ: భారతీయ సమాజంలో ధనత్రయోదశికి విశేషమైన ప్రత్యేకత ఉంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, యమత్రయోదశిగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ధనత్రయోదశిని ధనతేరస్గా జరుపుకుంటారు. ఈ రోజును ఐశ్వర్య ప్రదాయక రోజుగా వారు భావిస్తారు. ధన త్రయోదశి రోజున ఉత్తర భారతీయులు పలు ప్రత్యేక పూజల ద్వారా లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని పొందేందుకు ప్రత్యేకమైన రోజుగా భావించి పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశి సూచికగా భావిస్తారు. ఆ రోజున వెండి, బంగారాన్ని కొని ధనలక్ష్మిని అర్చిస్తారు. ధన్వంతరి అవతరణ దినోత్సవం కూడా.. ఆయుర్వేద వైద్యానికి ఆది పురుషుడైన ధన్వంతరి అవతరించినది కూడా ధనత్రయోదశి రోజునే. క్షీరసాగర మధనంలో మహాలక్ష్మీతో పాటుగా ధన్వంతరి కూడా ఆవిర్భవించినట్లు పౌరాణికగాథ. ప్రతి ధనత్రయోదశి రోజున జ్యూయలరీ దుకాణాల్లో విస్తృతమైన అమ్మకాలు జరుగుతాయి. ధనత్రయోదశి రోజు కోసం నెల రోజుల ముందు నుంచే వినియోగదారులను ఆకర్షించే విధంగా ప్రకటనలు ఇస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారతదేశంలో జరిగే మొత్తం బంగారు ఆభరణాల అమ్మకాల్లో ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా జరిగే అమ్మకాలు 15 నుంచి 20 శాతం ఉంటాయంటే దీని ప్రభావం ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జ్యూయలరీ దుకాణాల్లో ప్రారంభమైన సందడి నగరంలో ధనత్రయోదశికి సంబంధించి నాలుగు రోజుల క్రితం నుంచే జ్యూయలరీ దుకాణాల్లో సందడి ప్రారంభమైంది. పలు దుకాణాలు ఇప్పటికే ధనత్రయోదశికి ఆఫర్లు ప్రకటించాయి. మేకింగ్ చార్జీలు, తరుగులో ప్రత్యేకంగా రాయితీని ప్రకటించాయి. ఎంత బంగారం కొనుగోలు చేస్తే అంత వెండి ఉచితమని ప్రకటించాయి. వాటితో పాటుగా పలు ప్రత్యేక రాయితీలంటూ నాలుగు రోజులుగా విస్తృతంగా ప్రకటనలు చేస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది కూడా ధనత్రయోదశిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని వ్యాపారాన్ని పెంచుకునేందుకు జ్యూయలరీ దుకాణాలు పోటీ పడుతున్నాయి. నేటి మధ్యాహ్నం నుంచి త్రయోదశి తిథి ఈ ఏడాది ధనత్రయోదశి ఘడియలు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమై శనివారం మధ్యాహ్నం వరకూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది శుక్రవారం మరికొంతమంది శనివారం ఈ పర్వదినాన్ని జరుపుకుంటారని పండితులువ వివరిస్తున్నారు. -
సర్వరోగ నివారిణి ఆయుర్వేదం
విజయవాడ(లబ్బీపేట) ఆయుర్వేదం సర్వరోగ నివారిణి అని, రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యం, వైద్య విద్య అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ మిడ్‌సిటీలో సురక్ష,సుఖాయు ఆధ్వర్యంలో ఆదివారం ధన్వంతరి జయంతి వేడుకలు నిర్వహించారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ధన్వంతరి అవార్డులను అందచేసి సత్కరించారు. డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందన్నారు. అతి పురాతమైన ఆయుర్వేద వైద్య విధానం తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి నగరంలో ఆయుర్వేద వైద్య విద్యాలయాల స్థాపనకు తనవంతు కృషి చేస్తానన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయుర్వేద వైద్య విద్యను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇఎస్ఐ హాస్పటల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ప్రొఫెసర్ వి.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఇఎస్ఐలో ఆయుర్వేద డిస్పెన్సరీ, పడకలు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ సభ్యులు డాక్టర్ ఎంఎల్ నాయుడు, డాక్టర్ జీవీ పూర్ణచంద్, పి మురళీకృష్ణ తదితరుల పాల్గొన్నారు. డాక్టర్ సీఎల్ వెంకట్రావ్‌కు లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును అందచేయగా, డాక్టర్ ఎంజే నాయుడు, డాక్టర్ ఎంఎల్ నాయుడు, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులకు ధన్వంతరి అవార్డులు అందచేశారు.