సార్‌.. ఓ పది వేలు ఇస్తారా..! | Srikakulam Collector Swapnil Dinakar Photo Misused In Fake WhatsApp Account, Cyber Frauds Target 40 Departments | Sakshi
Sakshi News home page

సార్‌.. ఓ పది వేలు ఇస్తారా..!

Aug 20 2026 9:22 AM | Updated on Aug 20 2026 9:41 AM

Cyber fraudsters To Srikakulam Collector Swapnil Dinakar

శ్రీకాకుళం: సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్‌ పేరు, ఫొటోలను వాడేస్తూ అక్రమాలకు తెగబడుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేరు, డీపీలో అతని ఫొటోను యాడ్‌ చేసి థాయ్‌లాండ్‌ దేశం (ప్లస్‌ 66) కోడ్‌ నంబరుతో వాట్సాప్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి డబ్బుల కోసం మూడు రోజులుగా అధికారులకు మెసేజ్‌లు పెడుతున్న విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. 

40 విభాగాలకు మెసేజ్‌లు.. 
జిల్లాలో ప్రధానంగా ఉన్న  రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలతో కలిపి మొత్తంగా 56 శాఖలుండగా అందులో 40 శాఖల వారికి సైబర్‌ కేటుగాళ్లు మెసేజ్‌లు పంపడం గమనార్హం. వేరెవరికో ఆరోగ్యం బాగోలేదనో.. రూ.10 వేలు అవసరమనో ఓ వీడియో పెట్టి అభ్యర్థన ధోరణిలో ‘సర్‌’ అని సంబోధిస్తూ మెసేజ్‌ పెట్టడంతో అంతా అవాక్కయ్యారు. తమ ఉన్నతాధికారి ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారేంటని అయోమయానికి గురయ్యారు. 

ఫండింగ్స్‌ రిలీజ్‌ చేసే అధికారం ఆయన చేతుల్లో పనే కదా.. ఇలా అభ్యర్థించాల్సిన అవసరమేముందబ్బా అన్న అనుమానంతో కలెక్టరేట్‌ కార్యాలయంలోనే కీలక వ్యక్తి ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ఆ నంబర్‌ను బ్లాక్‌ చేసేశారు. ఇటువంటి ఫేక్‌ మెసేజ్‌లు సోషల్‌ మీడియాలో వస్తే స్పందించవద్దని అధికారులకు, ప్రజలకు కలెక్టరేట్‌ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement