Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు  | Crowd Of Devotees Increased In Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు  

Sep 17 2024 9:09 AM | Updated on Sep 17 2024 10:02 AM

Crowd Of Devotees Increased In Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. టీబీసీ అతిథిగృహం వద్దకు చేరుకుంది. సోమవారం  అర్ధరాత్రి వరకు 85,626 మంది స్వామివారిని దర్శించుకోగా 33,138 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. 

స్వామివారికి కానుకల రూపంలో హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వచ్చింది. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement