విమానాలకు ఎదురుగాలి

Covid‌ effect to AP aviation sector - Sakshi

కోవిడ్‌ వల్ల తగ్గిపోయిన విమాన సర్వీసులు, ప్రయాణికుల సంఖ్య 

2020–21లో 29,874 విమానాల్లో 22,27,686 మంది ప్రయాణం

2019–20లో 57,680 విమానాల్లో 52,65,386 మంది ప్రయాణం

దేశీయంగా పోలిస్తే రాష్ట్ర విమానాశ్రయాల క్షీణత తక్కువే

వందే భారత్‌ మిషన్‌తో విజయవాడకు విదేశీ విమానాల జోరు

విజయవాడకు 560 విదేశీ విమానాల ద్వారా 72,478 మంది ప్రయాణం

సాక్షి, అమరావతి: రాష్ట్ర విమానయాన రంగానికి కోవిడ్‌ దెబ్బ గట్టిగానే తగిలింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2020–21లో రాష్ట్ర విమాన ప్రయాణికుల్లో ఏకంగా 57 శాతం క్షీణత నమోదైంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం  వెల్లడైంది. 2020–21లో కోవిడ్‌ వల్ల విమాన సర్వీసులపై ఆంక్షలు ఉండటంతో ప్రయాణికులు స్వేచ్ఛగా ఎగరలేకపోయారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టుల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2019–20లో ఈ 5 ఎయిర్‌పోర్టుల నుంచి 51.65 లక్షల మంది ప్రయాణించగా.. అది 2020–21లో 22.27 లక్షలకు పరిమితమైంది.

ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 34.10 కోట్ల నుంచి 11.53 కోట్లకు పడిపోయింది. రాష్ట్రంలోని ఐదు విమానాశ్రయాల నుంచి గతేడాది కేవలం 29,874 విమానాలు మాత్రమే ఎగిరాయి. అంతకుముందు ఏడాది 57,680 సర్వీసులతో పోలిస్తే 48.21 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల సంఖ్య 25.87 లక్షల నుంచి 11.96 లక్షలకు పరిమితమయ్యాయి. దేశీయ విమానయాన రంగం మెల్లగా కోలుకుంటోంది అనుకుంటున్న తరుణంలో కరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఏడాది కూడా విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడిచే అవకాశాలు కనిపించడం లేదని విమానయాన సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.  

విశాఖకు ఆగిపోయిన విదేశీ విమానాలు.. 
రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నప్పటికీ.. కేవలం విశాఖకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తుండేవి. 2019లో విజయవాడ నుంచి సింగపూర్‌కు ఒక ఆరు నెలల పాటు వీజీఎఫ్‌ కింద విమాన సర్వీసులు నడిపారు. ఆ తర్వాత ఆ స్కీం ఆగిపోవడంతో.. విజయవాడకు అంతర్జాతీయ సర్వీసులు ఆగిపోయాయి. కోవిడ్‌ వల్ల అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఉండటంతో.. విశాఖకు వచ్చే విదేశీ విమానాల సంఖ్య భారీగా పడిపోయింది. 2019–20లో విశాఖకు 1,885 అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 89కి పరిమితమయ్యింది. గతంతో పోలిస్తే కేవలం 5 శాతం విదేశీ విమానాలు మాత్రమే గాలిలోకి ఎగిరాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య 95 శాతం క్షీణించి.. 1,43,535 నుంచి 7,581కి పడిపోయింది.   

విజయవాడకు విదేశీ విమానాల జోరు.. 
విజయవాడకు 2020–21లో భారీగా విదేశీ విమానాలు వచ్చి వాలాయి. 2019–20లో కేవలం సింగపూర్‌ నుంచి 52 సర్వీసులు నడవగా.. 2020–21లో ఏకంగా 40కిపైగా దేశాల నుంచి 560కి పైగా విదేశీ విమాన సర్వీసులు నడిచాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా 5,032 నుంచి 72,478కి పెరిగింది. లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ కింద ప్రత్యేక విమాన సర్వీసులు నడిపింది. మన రాష్ట్రానికి వచ్చే వారికోసం అత్యధిక సర్వీసులు విజయవాడ విమానాశ్రయానికి వచ్చాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-09-2021
Sep 14, 2021, 03:20 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారితో తలపడుతూ రాష్ట్రంలో టీకాల యజ్ఞం ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తాజాగా మరో మైలురాయిని...
13-09-2021
Sep 13, 2021, 07:34 IST
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): గ్రేటర్‌లో కోవిడ్‌ టీకాలు కోటికి చేరువయ్యాయి. అంచనాకు మించి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కేవలం స్థానికులే కాకుండా...
10-09-2021
Sep 10, 2021, 03:32 IST
కరోనా వైరస్‌ వ్యాప్తి 2020 మార్చి నుంచి ఉన్నా వేరియంట్‌లపై మనం ఎక్కువ దృష్టి సారించింది సెకండ్‌ వేవ్‌లోనే. దేశంలో...
08-09-2021
Sep 08, 2021, 03:03 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబ...
07-09-2021
Sep 07, 2021, 21:28 IST
హనోయి: కోవిడ్‌ నిబంధనలను ఉ‍ల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్‌ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల...
07-09-2021
Sep 07, 2021, 18:26 IST
న్యూఢిల్లీ: ​కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకుగాను ప్రారంభించిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా వేగంగా సాగుతుందని.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 కోట్ల...
06-09-2021
Sep 06, 2021, 05:00 IST
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా,...
06-09-2021
Sep 06, 2021, 03:10 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పట్టణాల్లో వేలల్లో ఉన్న కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఇప్పుడు...
05-09-2021
Sep 05, 2021, 03:24 IST
సాక్షి, అమరావతి: ‘దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రజారోగ్య వ్యవస్థ కేరళలో మాత్రమే ఉంది. అయినా సరే.. కోవిడ్‌ కట్టడి, నిర్వహణ...
05-09-2021
Sep 05, 2021, 01:57 IST
జూలూరుపాడు/బూర్గంపాడు/పినపాక /దమ్మపేట/టేకులపల్లి/యాదాద్రి: పాఠశాలలు తెరిచిన మూడో రోజునే భద్రాద్రి కొత్త గూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కరోనా కలకలం సృష్టించింది....
04-09-2021
Sep 04, 2021, 20:45 IST
హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌ సోమేశ్ కుమార్ విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల టీకా వివరాలకు సంబంధించి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో...
04-09-2021
Sep 04, 2021, 18:50 IST
మహమ్మారి కరోనా వైరస్‌ ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
03-09-2021
Sep 03, 2021, 18:15 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 64,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,520 మందికి కరోనా...
03-09-2021
Sep 03, 2021, 05:47 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 15,001గ్రామ/వార్డు సచివాలయాలుండగా 9,988...
03-09-2021
Sep 03, 2021, 03:21 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే...
02-09-2021
Sep 02, 2021, 17:02 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 59,566 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,378 మందికి కరోనా...
02-09-2021
Sep 02, 2021, 04:06 IST
కరోనా బారినపడ్డ వారిలో చాలావరకు కోలుకున్నా కొందరు మాత్రం పరిస్థితి సీరియస్‌ అయి చనిపోయారు. పొద్దున్నే బాగున్నవారు కూడా సాయంత్రానికో,...
01-09-2021
Sep 01, 2021, 17:32 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా...
01-09-2021
Sep 01, 2021, 16:10 IST
యశవంతపుర: కరోనా నియంత్రణ కోసం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో గట్టి చర్యలు తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్యా మంత్రి సుధాకర్‌...
01-09-2021
Sep 01, 2021, 03:46 IST
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ మరో రికార్డు సొంతం చేసుకుంది. మూడు కోట్ల డోసుల మైలురాయిని అధిగమించి... 

Read also in:
Back to Top