
మాట్లాడుతున్న సుమన్
కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): తమకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత, భరోసా కల్పించాలని కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆప్కాస్ ఏర్పాటు చేసిందని, దీంతో ఉద్యోగులకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ వచ్చి మేలు జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే, తమకు సర్విస్ రూల్స్ నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.