మేం ఓటేసిన హోంమంత్రి పరామర్శించరా!? | Concerns of families of youths who went missing in the river | Sakshi
Sakshi News home page

మేం ఓటేసిన హోంమంత్రి పరామర్శించరా!?

Nov 16 2026 3:34 AM | Updated on Nov 16 2026 3:34 AM

Concerns of families of youths who went missing in the river

జాతీయ రహదారి పైకి వస్తున్న కాలనీవాసులను అడ్డుకుంటున్న పోలీసులు

సాటి దళితులంటే చిన్నచూపా?? డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు 

అనకాపల్లి జిల్లా వరాహ నదిలో గల్లంతైన యువకుల కుటుంబాల ఆందోళన 

జాతీయ రహదారి దిగ్బంధం..  

కి.మీ. మేర నిలిచిపోయిన ట్రాఫిక్‌ 

ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడ్డ గోతులే కారణమని మండిపాటు 

ఎస్‌.రాయవరం: అనకాపల్లి జిల్లా ఎస్‌. రాయవరం మండలం పెనుగొల్లు దళిత కాలనీకి చెందిన ముగ్గురు యువకులు శనివారం వరాహ నదిలో గల్లంతై విగతజీవులుగా మారిన ఘటనలో బాధిత కుటుంబాలు ఆదివారం హోంమంత్రి అనిత తీరును నిరసిస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. కూలీనాలి చేసుకుని జీవించే కుటుంబాల్లో చేతికందొచ్చిన పిల్లలు నదిలో పడి చనిపోతే, తాము ఓటేసిన మంత్రి కనీసం తమను పరామర్శ చేయరా.. సాటి సామాజికవర్గం పిల్లలపైనే కనికరం లేకపోతే ఎలాగని మండిపడ్డారు. 

హోంమంత్రి డౌన్‌ డౌన్‌.. దళిత కులస్తులకు హోంమంత్రి న్యాయం చేయరా.. అంటూ సుమారు రెండు గంటలపాటు పెనుగొల్లు జంక్షన్‌లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయేలా చేశారు. అధికారుల నిర్లక్ష్యంవల్ల నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణాతో ప్రమాదకరంగా గోతులు ఏర్పడ్డాయని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి రూ.20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

అయితే, అధికారులు, నాయకులు, పోలీసులు ఎవరూ స్పందించకపోవడంతో యువకులు, మహిళలు జాతీయ రహదారిపైకి వెళ్లి వాహనాలు అడ్డుకుని ధర్నా నిర్వహించారు. దీంతో పెనుగొల్లు, తిమ్మాపురం, గోకులపాడు, ధర్మవరం అగ్రహారం, వమ్మవరం గ్రామాలకు చెందిన వారు కూడా పెద్దఎత్తున తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. దళితులంటే చిన్నచూపువల్ల సహాయం అందించేందుకు ముందుకు రావడంలేదని ఆరోపించారు. తాము ఓటేసి గెలిపించిన హోంమంత్రి వచ్చి న్యాయంచేయాలని పట్టుబట్టారు.  

యువతులపట్ల పోలీసుల దురుసు ప్రవర్తన.. 
ఈ సమయంలో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలు నిలువరించేందుకు ఆందోళనకారులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు యువతుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో వారి వ్రస్తాలు చిరిగిపోయాయి. గంటన్నర పాటు, నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, తహసీల్దార్‌ రమేష్‌బాబు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితంలేదు. పైగా.. రెండుసార్లు హోంమంత్రికి ఫోన్‌చేసినా మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. అయినా స్పష్టమైన హామీ కోసం బాధితుల డిమాండ్‌ మేరకు మూడోసారి ఫోన్‌ చేయగా మృతులు ఒక్కొక్కరికి తన వంతు సాయంగా లక్ష రూపాయల చొప్పున ఇస్తానని.. కుటుంబాలకు ప్రభుత్వ సాయం వచ్చేలా చేస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement