అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌పై సీఎం జగన్‌ సమీక్ష పూర్తి | CM YS Jagan Review Meeting On Agri Infrastructure Fund At Camp Office | Sakshi
Sakshi News home page

అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌పై సీఎం జగన్‌ సమీక్ష పూర్తి

May 12 2022 1:12 PM | Updated on May 12 2022 6:18 PM

CM YS Jagan Review Meeting On Agri Infrastructure Fund At Camp Office - Sakshi

సాక్షి, తాడేపల్లి: అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్‌కు ప్రాజెక్టుల పరోగతిని వివరాలను వివరించగా.. ఆయన పలు సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేశారు. 

అగ్రి ఇన్‌ఫ్రా కింద ప్రాజెక్టుల పురోగతి
► అగ్రి ఇన్‌ఫ్రా కింద సుమారు రూ.16,404.86 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులు.
► వ్యవసాయ అనుబంధశాఖల్లో సుమారు 30 రకాల పనులు.
► వ్యవసాయ, అనుబంధరంగాల్లో మౌలికసదుపాయాల కల్పన పనులు యుద్ధప్రాతిపదికన ముందుకు సాగాలన్న సీఎం జగన్‌.
► అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖలో మూడు రకాల నిర్మాణాలు చేపడుతున్నామని వివరించిన అధికారులు.
► రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్‌ రూములు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాంలు నిర్మాణం.
► ఇప్పటికే తొలిదశలో 1165 గోదాములు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంల నిర్మాణానికి సంబంధించి స్ధలాల ఎంపిక పూర్తైందన్న అధికారులు.
► 510 చోట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్న అధికారులు.
► యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని, ఏడాదిలోగా మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని.. పనులు పూర్తి చేయాలన్న సీఎం జగన్‌ ఆదేశం.
► ఆర్బీకేలను ఆంధ్రప్రదేశ్‌ మానసపుత్రికగా ప్రపంచ వేదికలమీదే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే స్ధాయిలో ప్రైమరీ ప్రాససింగ్, డ్రైయింగ్‌ ప్రాట్‌ఫాంలు, గోదాములు, కోల్డ్‌రూంలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆర్బీకేలు సమర్థవంతంగా పనిచేయాలంటే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు చాలా కీలకమైనవి. ఏడాదిలోగా కచ్చితమైన ఫలితాలు కన్పించాలని అధికారుతో చెప్పిన సీఎం జగన్‌.

వైఎస్సార్‌  యంత్ర సేవా పథకంపైనా సీఎం సమీక్ష
► ప్రతి ఆర్బీకేలో కూడా యంత్రసేవా పథకం ఉండాలని సీఎం జగన్‌ ఆదేశం.
► ప్రతి త్రైమాసికానికి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆమేరకు ప్రతి ఆర్బీకేకు, క్లస్టర్‌కు యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలని, అంతేకాకుండా రైతులకు వ్యక్తిగత సబ్సిడీపై అందించే వ్యవసాయ పరికరాలపైనా దృష్టిపెట్టాలని సూచించారు.

కిసాన్‌ డ్రోన్స్‌ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష
► మొదటగా 2వేల డ్రోన్‌ యూనిట్లు.
► ఇందులో భాగంగా తొలుతగా 2వేల ఆర్బీకేల దృష్టి.
► అవసరమైన మేరకు డ్రోన్‌ యూనిట్లను పెంచుకోవాలన్న సీఎం జగన్‌.
► ప్రతి మండలంలో కనీసం 4 ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకోవాలని, ఆర్బీకేల పరిధిలో డ్రోన్‌ పైలట్లను గుర్తించాలని సీఎం జగన్‌ సూచన.
► రైతుల్లో సైన్స్‌ గ్రాడ్యుయేషన్, ఇంటర్‌ సైన్స్‌ గ్రూపు చదువుకున్న రైతుల గుర్తింపు.
అలాగే నానో యూరియా(ఫెర్టిలైజర్స్‌) వాడకంపై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం జగన్‌.
► ఉద్యానపంటల ఉత్పత్తులు అధికంగా ఉన్నచోట డ్రై గోదాములు నిర్మాణానికి ప్రతిపాదనలు
► డిసెంబరు 22 నాటికి మొదలుపెట్టి మార్చి 2023 నాటికి పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు.

పశుసంవర్ధకశాఖ సీఎం సమీక్షలో..
► రెండు దశల్లో వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ –అంబులెన్స్‌లు ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉన్నామని అధికారులు వివరించారు.
► తొలిదశ కింద 175 అంబులెన్స్‌లు, రెండో దశలో మరో 165 అంబులెన్స్‌లు సిద్ధమని అధికారులు చెప్పారు.

జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష..

► త్వరలో అనకాపల్లి జిల్లాలో అమూల్‌ జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభం.
► అనకాపల్లి జిల్లాలో 191 గ్రామాల్లో ప్రారంభం కానున్న పాలసేకరణ.
► మరో రెండు నెలల్లో ఇప్పటికే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న జిల్లాలతో పాటు మొత్తం 1,282 గ్రామాల్లో ప్రారంభం కానున్న పాలసేకరణ.
► ప్రాధాన్యతా క్రమంలో బీఎంసీ యూనిట్ల నిర్మాణం.
► 1184 బీఎంసీలు, 2388 ఏంఎసీల నిర్మాణం.
► ప్రైవేటు డైరీలలో రైతులు మోసానికి గురికాకుండా చూడాలని సీఎం జగన్‌ సూచన. 
► పాలసేకరణ, వెన్న శాతం నిర్ధారణలో కచ్చితమైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, జగనన్న పాలవెల్లువ కార్యక్రమాల ద్వారా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు.

► ఆక్వా ఫీడ్‌ రేట్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్న సీఎం జగన్‌.. రైతులకు అందుబాటులోఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆర్బీకేల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని ఆమేరకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆర్బీకేల్లో ఆక్వా అసిస్టెంట్లు ఉన్నారు, వారి నుంచి క్షేత్రస్థాయిలో సమస్యలను నివేదికలు రూపంలో తీసుకుని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతు ఇబ్బంది పడితే.. ఆ ప్రభావం ఆక్వా ఉత్పత్తులపై పడుతుందని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్‌ అధికారులకు చెప్పారు.

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష.
► ఫేజ్‌ –1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయన్న అధికారులు.

► ఫేజ్‌ –2లో చేపట్టనున్న మిగిలిన 5 షిఫింగ్‌ హార్బర్ల (బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, వాడరేవు, కొత్తపట్నం) పనులు ఈ జులైలో ప్రారంభిస్తామన్న అధికారులు.
 వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ చెప్పారు.

ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వీ యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, పుడ్‌ ప్రాససింగ్‌ కార్యదర్శి ఎం కె మీనా, అగ్రికల్చర్‌ కమిషనర్‌ సి హరి కిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్, మార్క్‌ఫెడ్‌ ఎండీ పీ ఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, ఏపీడీడీసీఎఫ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ బాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


చదవండి: సీఎం జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement