CM Jagan Review Meeting: సీఎం జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం

CM Jagan Review Meeting with State Investment Promotion Board - Sakshi

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ)తో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐపీబీ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 

1. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్‌ భారతి కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (క్రిబ్కో) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్‌ ప్లాంట్‌.
►రూ.560 కోట్లతో 250 కె.ఎల్‌.డి. సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు. 
►100 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న క్రిబ్‌కో, 400 మందికి ఉద్యోగాలు.
►ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ.
►ఇదికాకుండా మరిన్ని విత్తన శుద్ధి సహా వివిధ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన కంపెనీ.

2. ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు
►ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు
►ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని లక్ష్యం
►దీంట్లో భాగంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం

3. ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్స్‌ పాలసీ 2022–2027లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:
►రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు ఉన్నాయి
►ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలి
►ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలి
►దేశంలో మెరైన్‌ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే
►అందుకనే ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించండి
►సింగిల్‌డెస్క్‌ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
►అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చాం
►విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు
►త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఎస్‌ఐపీబీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి మత్యాలనాయుడు, ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణం, గనులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కార్మిక, ఉపాధిశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌ కె రోజా, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: (నేను కూడా చేనేత కుటుంబ కోడలినే: మంత్రి ఆర్కే రోజా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top