నేను కూడా చేనేత కుటుంబ కోడలినే: మంత్రి ఆర్కే రోజా

Minister RK Roja Started APCO Summer Saree Mela in Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఆప్కో సమ్మర్ సారీ మేళాను ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రాష్ట్ర నలుమూలలా ఆప్కో షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మర్‌ శారీ మేళా ద్వారా మహిళలకు 30శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు. చీరలు, చుడీదార్‌లు, పెళ్లి బట్టలు చాలా రకాల వెరైటీల్లో దొరుకుతున్నాయన్నారు. మహిళల మనసు దోచే విధంగా ఆప్కోలో చీరలు ఉన్నాయన్నారు. బయట షోరూమ్‌లకు ధీటుగా ఆప్కో షోరూమ్‌లు ఉన్నాయన్నారు.

తాను కూడా చేనేత కుటుంబ కోడలినని మంత్రి రోజా తెలిపారు. నేతన్నలకు ఆర్ధిక చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు అందిస్తున్నారని  అన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు సహకరిద్దామని ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top