AP: రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం జగన్‌ దంపతులు | AP CM YS Jagan Returns From London | Sakshi
Sakshi News home page

AP: రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం జగన్‌ దంపతులు

Sep 12 2023 7:08 AM | Updated on Sep 12 2023 8:58 AM

CM YS Jagan Returned Back To AP - Sakshi

సాక్షి, విజయవాడ: లండన్‌ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సీఎం జగన్‌ దంపతులకు ఘన స్వాగతం లభించింది.

సీఎం జగన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ వద్ద సీఎస్‌, మంత్రులు, డీజీపీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్‌ దంపతులు రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయల్దేరిన క్రమంలో దారి పొడువునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement