అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్‌

CM YS Jagan Palnadu And Guntur Live Updates: Inaugurate ITC Global Spices Centre - Sakshi

Updates

12:35PM
మైనార్టీ దినోత్సవంలో సీఎం జగన్‌ స్పీచ్‌

నేడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 135వ జయంతి
మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సేవలు మరువలేనివి
ముస్లింల్లో పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్‌
పదవుల నుంచి సంక్షేమం వరకూ అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం
ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాం
నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చాం
శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవిని మైనార్టీకి కేటాయించాం
మూడేళ్లలో మైనార్టీలకు డీబీటీ ద్వారా రూ. 10,309 కోట్లు అందించాం
నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ. 10 వేల కోట్లు అందించాం
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు రూ. 2,665 కోట్లు ఇస్తే..మూడేళ్లలోనే మేము రూ. 20 వేల కోట్లకు పైగా ఇచ్చాం
వక్ఫ్‌ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం
ఇప్పటికే అన్యాక్రంతమైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాం
ఈ ప్రభుత్వం మీది అని మర్చిపోవద్దు

12:17PM
గుంటూరు: మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్‌

11:06AM

గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ప్రారంభోత్సవ కార్యక‍్రమంలో సీఎం జగన్‌ స్పీచ్‌

ఐటీసీ సంస్థకు అభినందనలు
ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ వల్ల వేలాది మంది రైతులకు మేలు కలుగుతుంది
ఇదొక వండర్ ఫుల్ మూమెంట్‌
సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు
15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు
రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గరే ఉంటుంది
ఈ యూనిట్ 14 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నా
24 నెలల్లోనే యూనిట్ ను పూర్తి చేశారు
ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇదొక నిదర్శనం
మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది
3450 కోట్లతో ప్రతీ జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాం
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి
మొదటి దశ కింద 1250 కోట్లతో 10 యూనిట్లకు డిసెంబర్ , జనవరి నెలల్లో శంకుస్థాపన
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయి
రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ప్రాసెసింగ్ చేసే విధానం చాలా బాగుంది
ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుంది
ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుంది
ఏ చిన్న సమస్య ఉన్నా... ఒక్క ఫోన్ చేసినా చాలు వెంటనే స్పందిస్తాం

10:37AM
వంకాయలపాడు సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌

గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌కు ప్రారంభోత్సవం

10:01AM
వంకాయలపాడు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

ప్రముఖ మల్టీ నేషనల్‌ కంపెనీ ఐటీసీ.. రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్‌కమ్‌ పేరుతో గుంటూరులో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను అందుబాటులోకి తేనుంది.

► సుమారు 6.2 ఎకరాల్లో  ఈ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేసి, ఎగుమతి చేసే విధంగా గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేసి ఎగుమతి చేయనుంది.

► సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఈ గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌కు.  పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

► గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్‌ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి, వేగంగా విస్తరించింది.

► సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్‌ బ్రాండ్‌ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. 

గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ప్రారంభ కార్యక్రమ అనంతరం.. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. ఆపై గుంటూరు మెడికల్‌ కళాశాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు సీఎం జగన్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top