బద్వేలులో అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన | CM YS Jagan Foundation Stone For Development Projects In Badvel | Sakshi
Sakshi News home page

బద్వేలులో అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

Jul 9 2021 12:21 PM | Updated on Jul 9 2021 1:54 PM

CM YS Jagan Foundation Stone For Development Projects In Badvel - Sakshi

సాక్షి, వైఎస్‌ఆర్‌ జిల్లా: రెండో రోజూ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బద్వేలులో పర్యటిస్తున్నారు. బద్వేలులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం తర్వాత ఎర్రముక్కపల్లెలోని  సీపీ బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు చేరుకుని బ్రౌన్‌  విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌ సమీపంలోని మహావీర్‌ సర్కిల్‌కు చేరుకుని  శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ నుంచి వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియం చేరుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement