సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమెర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. 
మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో ఉన్న పామూరు బస్‌స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.   
					
					
					
					
						
					          			
						
				
 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
