Andhra Pradesh: CM YS Jagan Called To Amanchi Krishna Mohan - Sakshi
Sakshi News home page

ఆమంచికి సీఎం పరామర్శ

Jul 20 2023 8:52 AM | Updated on Jul 20 2023 1:16 PM

CM YS Jagan Called To Amanchi Krishna Mohan - Sakshi

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌­సీపీ పర్చూరు నియో­జకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమో­హన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. సోమ వారం రాత్రి ఆమంచికి చెందిన ఆక్వా నర్సరీ లో వాకింగ్‌ చేస్తుండగా కట్లపాము కాటేసింది. 

దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణా పాయం నుంచి కాపాడారు. వైద్యుల సూచన లతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విజయ­వాడలోని మణిపాల్‌ ఆస్పత్రికి ఆమంచిని తరలించగా  మంగళవారం ఆయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement