అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

Published Tue, Apr 9 2024 8:11 AM

Cm Jagan Wishes Sri Krodhi Nama Samvatsara Ugadi Subhakankshalu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement