రేపు సీఎం జగన్‌ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన  | CM Jagan visit to Kurnool and Guntur district on Feb 15th | Sakshi
Sakshi News home page

రేపు సీఎం జగన్‌ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన

Published Wed, Feb 14 2024 4:49 AM | Last Updated on Wed, Feb 14 2024 4:49 AM

CM Jagan visit to Kurnool and Guntur district on Feb 15th - Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15వతేదీన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు, అక్కడ బళ్ళారి రోడ్‌లోని ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో వలంటీర్ల అభినందన సభలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement