నాలుగేళ్ల పాలనపై సీఎం జగన్‌ ట్వీట్‌

CM Jagan Tweet On 4 Years Of YSRCP Government Rule In AP - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నాలుగేళ్ల పాలనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘ దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తైందని, నాపై ఎంతో నమ్మకంతో మీరు ఈ బాధ్యతను అప్పగించారు. 

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ నాలుగేళ్ల కాలంలో 98 శాతానికి పైగా ఎన్నికల హామీలను మన ప్రభుత్వంలో అమలు చేశాం. అలాగే వివిధ రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ.. మన ప్రభుత్వంపై మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

కాగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల­కిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నాలు­గేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివ­రికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొన­సాగి­స్తున్నారు.
చదవండి: ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top