‘స్వతంత్ర’ న్యూస్‌ చానల్‌ స్టూడియోలు ప్రారంభం | CM Jagan Launched Swatantra News Channel Studios | Sakshi
Sakshi News home page

‘స్వతంత్ర’ న్యూస్‌ చానల్‌ స్టూడియోలు ప్రారంభం

May 20 2022 5:14 AM | Updated on May 20 2022 3:01 PM

CM Jagan Launched Swatantra News Channel Studios - Sakshi

న్యూస్‌ చానల్‌ స్టూడియోలను ప్రారంభిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి : ‘స్వతంత్ర’ తెలుగు శాటిలైట్‌ న్యూస్‌ చానల్‌ స్టూడియోలను గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ చానల్‌ యాజమాన్యానికి, సిబ్బందికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సమాచార శాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ రెడ్డి, ఆ చానల్‌ ఎండీ బి.కృష్ణప్రసాద్, ఎడిటర్‌ తోట భావ నారాయణ, అసిస్టెంట్‌ ఎడిటర్‌ రమా విశ్వనాథన్, చీఫ్‌ న్యూస్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల అమరయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement