ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు

Published Thu, Oct 5 2023 4:13 PM

Cm Jagan Congratulates Athletes Who Won Gold In The Asian Games - Sakshi

సాక్షి, అమరావతి: ఏషియన్ గేమ్స్‌లో బంగారు పథకం సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన వీజే.సురేఖ, పరిణీత్, అదితిగోపీచంద్ స్వామిలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడకు చెందిన సురేఖ సాధించిన విజయంపై రాష్ట్రమంతా  గర్వపడుతోందన్న సీఎం.. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ ట్వీట్ చేశారు.

ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్‌ వుమెన్స్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్‌ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు.
 చదవండి: గురి తప్పలేదు.. అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం

 
Advertisement
 
Advertisement