వైఎస్సార్‌సీపీ నేత కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్‌

Cm Jagan Attends Ysrcp Leader Gunnam Nagababu Son Wedding - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కాళ్ల మండలం పెద అమిరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌లో పాలకొల్లు వైఎస్సార్‌సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు కుమారుడు సుభాష్ వివాహానికి సీఎం హాజరయ్యారు. వరుడు గుణ్ణం సుభాష్, వధువు దీప్తిలను సీఎం జగన్‌ ఆశ్వీరదించారు.

ఈ వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు బాబు, శ్రీ రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు.

 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top