
సాక్షి,అమరావతి : సూపర్ సిక్స్ అమలుపై సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని, ఆర్ధిక పరిస్థితి మెరుగుపడ్డాకే పథకాల అమలు చేస్తామని ప్రకటించారు.
నీతి ఆయోగ్ రిపోర్ట్‌పై చంద్రబాబు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ అమలుపై చేతులెత్తేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదంటూ మరోసారి అబద్ధాలు చెప్పారు. ఆర్ధిక పరిస్థితి మెరుగపడ్డాకే పథకాల అమలు చేస్తానంటూ చంద్రబాబు మరోసారి మోసానికి తెరతీశారు.
ఎన్నికల సమయంలో అప్పులు రూ.14లక్షల కోట్లంటూ ఇదే చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. అప్పులున్నా హామీలు అమలు చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అమలు చేస్తానంటూ వాగ్ధానం ఇచ్చిన చంద్రబాబు .. ఇప్పుడు అప్పల పేరుతో తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడ వేయడంపై రాష్ట్ర ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.