కరువు ప్రకటనపై దిగివచ్చిన బాబు సర్కార్‌ | Chandrababu Directs Collectors to Submit Reports on Drought Impact | Sakshi
Sakshi News home page

కరువు ప్రకటనపై దిగివచ్చిన బాబు సర్కార్‌

Sep 20 2026 5:35 AM | Updated on Sep 20 2026 5:42 AM

Chandrababu Directs Collectors to Submit Reports on Drought Impact

వైఎస్‌ జగన్‌ హెచ్చరికతో కరువు మండలాల ప్రకటనకు సిద్ధమైన ప్రభుత్వం..మండలాల వారీగా నష్టం అంచనాకు కసరత్తు

ఈనెల 24లోగా కరువు ప్రభావంపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు

సాక్షి, అమరావతి: ఎట్టకేలకు కరువు మండలాల ప్రకటనకు బాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మం­డలాల వారీగా నష్టాల అంచనాకు కస­రత్తు మొ­దలుపెట్టింది. ఈ నెల 24లోగా కరువు పరిస్థి­తులపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాన్ని కరువు కమ్మే­సినా బాబు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల తీవ్రంగా విరుచుకుపడ్డారు. 

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య తీరును ఎండగట్టారు. తక్షణమే కరువు మండలా­లను ప్రకటించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు మొద్దునిద్ర వీడకపోతే ఆందోళనబాట ప­డతామని హెచ్చరించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎట్టకేలకు కరువు మండలాల ప్రకటనపై కసరత్తు ప్రారంభించింది. 

54.3 శాతం లోటు వర్షపాతం..
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన తర్వాత జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 20కి 54.3 శాతం వర్షపా­తం లోటు నమోదైనట్లు రెవెన్యూ(విపత్తు నిర్వహ­ణ) శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితు­ల దృష్ట్యా కరువు ప్రకటన చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ మేరకు కలె­క్టర్లకు ఆదేశాలిచ్చింది. ముందస్తు కరువు పరిస్థితుల అంచనా చేపట్టా­లని సూచించింది. కరువు ప్రాంతంగా గుర్తించేందుకు వర్షాభావంతో పాటు వ్యవసాయ పంటలు, భూస్థితి తదితరా­లపై చూపిన ప్రభావాన్ని కూడా లెక్కించాలని ఆదేశించింది. ఏ మండలంలో వర్షా­భా­వం ఎక్కువ­గా ఉంది? ఎక్కడ సాగు దెబ్బతింది, ఏఏ పంటలు ఏంత మేర ఎండిపోయాయి? దిగుబడులు ఏ మేరకు తగ్గే పరిస్థితి ఏర్పడిందో పక్కాగా డేటా సేకరించాలని స్పష్టం చేసింది. 

ఈ నెల 24లోగా జిల్లాల వారీగా కరువు పరిస్థితు­లపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. నగరాలు, పట్టణాలు, మండలాలకు సంబంధించి నిర్దేశిత నమూనాల్లో కరువు ప్రతిపాదనలను పంపించాలని సూచించింది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు నమోదైన వర్షపాతంతో పాటు పొడి వాతావరణం ప్రభావ సూచికల వివరాలను పరిగ­ణనలోకి తీసుకుని అంచనా వేయాలంది. కరువు ప్రతిపాదన­లలో క్షేత్రస్థాయి వాస్తవ నివేదికను కూడా పొందుపర్చాలని ఆదేశించింది. పంట న­ష్టం వివరా­లను క్షేత్రస్థాయి ఫొటోల ద్వారా నమో­దు చేయా­లని పేర్కొంది. ఆ ఫొటోలను, వివ­రాలను జిల్లా స్థాయిలో భద్రపరచాలని ఆదేశాలి­చ్చింది. మండలాల వారీగా జిల్లాల నుంచి అందే ప్రతిపాదనల ఆధారంగా కరువు మండలాల ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈనెల 30లోగా అన్నీ సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement