ఏపీ పోలీస్‌ అధికారులకు కేంద్ర పురస్కారాలు  | Central Awards For AP Police Officers | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీస్‌ అధికారులకు కేంద్ర పురస్కారాలు 

Aug 13 2021 9:02 AM | Updated on Aug 13 2021 9:02 AM

Central Awards For AP Police Officers - Sakshi

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021కి గానూ దర్యాప్తులో అత్యంత ప్రతిభ చూపినందుకు కేంద్ర హోం శాఖ గురువారం వీటిని ప్రకటించింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021కి గానూ దర్యాప్తులో అత్యంత ప్రతిభ చూపినందుకు కేంద్ర హోం శాఖ గురువారం వీటిని ప్రకటించింది. ఈ పురస్కారం దక్కిన వారిలో 15 మంది సీబీఐకి చెందిన వారున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి 11 మంది చొప్పున, కేరళ, రాజస్థాన్‌ నుంచి 9 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్‌ (10), తమిళనాడు (8), బిహార్‌ (7), తెలంగాణ (5), గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ నుంచి ఆరుగురు ఉన్నారు. పురస్కారాలు లభించినవారిలో 28 మంది మహిళా అధికారులుండటం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement