తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | Celebrities Visit Tirumala Temple | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Jun 13 2021 10:12 AM | Updated on Jun 13 2021 10:47 AM

Celebrities Visit Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడుతూ, స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఆనందంగా ఉంటుందన్నారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి, దేశ ప్రజలకు స్వామివారి కృపా ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు.

చదవండి: భక్తులకు మరింత సులభంగా వసతి గదులు
వీడని ‘పీఠ’ముడి!

Advertisement
 
Advertisement
Advertisement