Eluru: లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడు.. గర్భం విషయం తెలియగానే..

Case Registered against man who cheated girl he loved in Nuzividu - Sakshi

నూజివీడు: మండలంలోని రావిచర్లకు చెందిన దేవరపల్లి సురేష్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ శుక్రవారం ఫిర్యాదు చేసింది. తనను లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడని.. తనకు గర్భం విషయం తెలిపి పెళ్లి చేసుకోమని అడగగా, పథకం ప్రకారం జ్యూస్‌లో మందు కలిపి తాగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యువతికి గర్భస్రావం అయింది.

తనకు జరిగిన అన్యాయాన్ని సురేష్‌ పెద్దవాళ్ల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు ఆమెను అవమానించి, గ్రామమంతా చెప్పి అల్లరిపాలు చేస్తామని బెదిరించారంటూ బాధితురాలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తలారి రామకృష్ణ తెలిపారు.   

చదవండి: (పరువు తీశారని మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య)

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top