సాక్షి, విజయనగరం జిల్లా: పార్టీ కమిటీలను సమర్థవంతంగా నియమించాలని, వైఎస్సార్‌సీపీని సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఓటరు పేరు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. పక్క రాష్ట్రాల్లో SIR వలన పార్టీలు ఓడిపోయాయి. అందువలన ఓటర్ లిస్ట్‌లపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సూచించారు.
‘‘కొందామంటే ఎరువులు లేవు. అమ్ముదామంటే పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం పేదల కోసం ఆలోచించడం లేదు. మాయ, మోసం, దగాతో మళ్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక్క స్కూల్ కట్టారా? స్కూల్స్ ఓపెన్ అయితే పుస్తకాలు, యూనిఫామ్‌లు లేవు అంటున్నారు. ప్రభుత్వ సంస్థను మూసేసి ప్రైవేట్‌కి ఇచ్చేయాలనే తాపత్రయం తప్ప పాలన పై ధ్యాస లేదు.
ఉత్తరాంద్ర ఎమ్మెల్యేకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఏం ఉపయోగం. ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు. యూరియా ఇవ్వలేని దిక్కుమాలిన దుస్థితి లో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అన్ని శాఖలు పడుకున్నాయి. హోమ్ శాఖ మాత్రం తప్పుడు కేసులు పెట్టడానికి, ఇతరులను అవమానించడానికి పని చేస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.


