‘చంద్రబాబుకు దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలి’

Botsa Satyanarayana Comments On Chandrababu Naidu - Sakshi

అమరావతి: అమరావతిలో దళితుల భూములను ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిపి చంద్రబాబు అక్రమంగా కాజేశారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఎదుర్కొవాలని బొత్స డిమాండ్‌ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే అమరావతి భూకుంభ కోణంపై ప్రశ్నిస్తుందని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. అయితే తమ ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష సాధించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ చంద్రబాబు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరపనట్టైతే విచారణ ఎదుర్కొవాలిగానీ..కోర్టులకు వెళ్ళి అడ్డదారిలో స్టేలు తెచ్చుకోవడమేంటని బొత్స ప్రశ్నించారు.

ఈ సందర్భంగా బొత్స , వైఎస్సార్సీపీవై  చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్ళయ్యిందని ఒకవేళ మేము తప్పుచేస్తే ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకొలేక చంద్రబాబు బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాగా, దళితులకు అన్యాయం జరిగితే ఎవరైన ఫిర్యాదు చేయవచ్చని,  కేవలం దళితుడే కావాల్సిన అవసరం లేదని గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే, రాజధాని భూఅక్రమాలపై ఆర్కే ఫిర్యాదుచేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

చదవండి: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top