తిరుపతిలో మైనర్‌పై బ్లేడ్ బ్యాచ్ దాడి | Blade Batch Attack On Supriya At Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో మైనర్‌పై బ్లేడ్ బ్యాచ్ దాడి

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:32 AM

Blade Batch Attack On Supriya At Tirupati

సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలోని జీవకోనలో ఓ మైనర్ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. జీవకోన అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో బాధితురాలిని జీవకోనకు చెందిన కూర్మా రావు కుమార్తె సుప్రియ (16)గా గుర్తించారు.

కాగా, బ్లేడ్‌ దాడిలో గాయపడిన బాలికను స్థానికులు రక్షించి చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలికపై గతంలోనూ దుండగులు యాసిడ్ పోసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు వెల్లడించారు. తాజా దాడికి గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: ‘కేసు నుంచి తప్పించండి.. ఎంతైనా ఇస్తాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement