జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం: సజ్జల | Babu Jagjivan Ram Jayanti Celebrations At YSRCP Central Office | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం: సజ్జల

Apr 5 2021 2:03 PM | Updated on Apr 5 2021 2:20 PM

Babu Jagjivan Ram Jayanti Celebrations At YSRCP Central Office - Sakshi

జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి బాబూ జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయమన్నారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి బాబూ జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయమన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్‌రామ్‌ అన్నారు.

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను పైకి తెచ్చే ప్రక్రియ ఒక యజ్ఞంలా సాగుతోందన్నారు. ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగాలని.. పెద్దల ఆశయాలను నిజం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
చదవండి:
బాబు జగ్జీవన్‌కు సీఎం జగన్‌ నివాళి

‘ఓ పార్టీలో పప్పు.. మరో పార్టీలో కామెడీ యాక్టర్’
‘పవన్‌, లోకేష్‌.. ఇదో అజ్ఞానపు సంత’

 

Advertisement
 
Advertisement
Advertisement