పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో వివాదం | AP West Rayalaseema MLC Counting Controversy | Sakshi
Sakshi News home page

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో వివాదం

Mar 18 2023 10:39 AM | Updated on Mar 18 2023 11:20 AM

AP West Rayalaseema MLC Counting Controversy - Sakshi

సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో వివాదం నెలకొంది. ఇండిపెండెంట్ల ఓట్లను కౌంటింగ్ సిబ్బంది టీడీపీ ఖాతాలో కలిపారంటూ వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. అనంతరం కౌంటింగ్ సిబ్బంది అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సిబ్బందిని టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్‌లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్‌ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌంటింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు  టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement