breaking news
rayalseema
-
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో వివాదం
సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో వివాదం నెలకొంది. ఇండిపెండెంట్ల ఓట్లను కౌంటింగ్ సిబ్బంది టీడీపీ ఖాతాలో కలిపారంటూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. అనంతరం కౌంటింగ్ సిబ్బంది అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సిబ్బందిని టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్‌లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు. -
వికేంద్రీకరణే సీమ అభివృద్ధికి దిక్సూచి
సాక్షి అమరావతి/సాక్షి నెట్వర్క్: వికేంద్రీకరణే రాయలసీమ అభివృద్ధికి దిక్సూచి అని సీమ ప్రజ ఎలుగెత్తి చాటింది. పాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి మద్దతు పలికింది. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి ద్వారా భవిష్యత్తులో వేర్పాటు వాదం రాకూడదన్నదే సీఎం జగన్ ఆలోచన అని వెల్లడించింది. పాలన వికేంద్రీకరణ చేసి, శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. 1937 నవంబర్ 16న జరిగిన శ్రీబాగ్ ఒడంబడికకు 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ఒప్పందం స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే ఉద్దే్దశంతో బుధవారం సీమ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. ర్యాలీలు, మానవ హారాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా కార్యాక్రమాలు, సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. ప్రజలు, విద్యార్థి, యువజన సంఘాలు, న్యాయవాదులు, మేధావులు పొల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఉద్యమ శంఖారావం కర్నూలు నగరంలో జేఏసీ చైర్మన్ విజయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజ్ విహార్ సర్కిల్లో వేలాది మందితో మానవహారం ఏర్పాటు చేశారు. ప్లకార్డులు పట్టుకుని మూడు రాజధానుల కోసం నినదించారు. విద్యార్థులు వినూత్నంగా ‘శ్రీబాగ్ 1937’ ఆకారంలో కూర్చొన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయ రాజధానిని సాధించుకోకపోతే భావితరాలు మనల్ని క్షమించవవన్నారు. 25న భారీ సభ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా తమ వాణిని వినిపిస్తామని చెప్పారు. ఎంపీ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు. నంద్యాల గాంధీచౌక్‌లో జేఏసీ చైర్మన్ బంగారురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ, మానవహారంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండలో భారీ ర్యాలీలు,ఆదోనిలో, ఆలూరులో రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగాయి. నందికొట్కూరులో నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్యే ఆర్థర్, ప్రజలు పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల్సిందే శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసి తీరాల్సిందేనని మేధావులు, ప్రజా సంఘాల నేతలు ఉద్ఘాటించారు. వికేంద్రీకరణకు మద్దతుగా బుధవారం వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా రౌండ్‌టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. కడపలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, డాక్టర్ ఓబుల్‌రెడ్డి, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. మైదుకూరు నియోజకవర్గం, దువ్వూరులో మేధావులు, రైతు, ప్రజా సంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ వరప్రసాద్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కమలాపురంలో బెక్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? తిరుపతిలో జరిగిన శ్రీబాగ్ ఒప్పంద దినోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ, పలువురు మేధావులు మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో తప్ప మరెప్పటికీ శ్రీబాగ్ ఒప్పందం అమలు కాదని భూమన స్పష్టంచేశారు. శ్రీబాగ్ ఒప్పందం రాజకీయ పార్టీ ఒప్పందం కాదని, పెద్ద మనుషుల ఒప్పందమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. సూళ్లూరుపేట, నాయుడుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేశారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో మానవహారం, రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురంలో వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. శింగనమలలో ప్రభుత్వ సలహాదారు(విద్య) ఆలూరి సాంబశివారెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. గుంతకల్లులో ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉరవకొండ బుదగవిలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పెనుకొండ, మడకశిర, కదిరి ఎమ్మెల్యేలు శంకరనారాయణ, తిప్పేస్వామి, సిద్ధారెడ్డి హాజరయ్యారు. మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అందరినోటా.. వికేంద్రీకరణ మాట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో, నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో, కావలి నియోజకవర్గం బోగోలులో ర్యాలీలు నిర్వహించారు. -
వరద ‘సీమ’.. నెల్లూరు జిల్లాలో బీభత్సం
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఏపీలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా తేరుకుంటున్నాయి. వరదలు ఇంకా పూర్తిగా శాంతించలేదు. రైలు పట్టాల కిందకు నీరు చేరి ఉధృతికి కొట్టుకుపోవడంతో విజయవాడ– నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేశారు. తిరుపతిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. సహాయక చర్యల్లో ఐదువేల మందితో కూడిన యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోనే 17 మంది మృతి చెందగా చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురంలో ఏడుగురు మరణించారు. వరద ప్రభావిత నాలుగు జిల్లాల్లో 274 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 31,827 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాండవ్యలో అక్కాతమ్ముడి గల్లంతు వైఎస్సార్ కడప జిల్లాలో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోవడంతో సంభవించిన వరదల్లో గల్లంతైన వారికి సంబంధించి 15 మృతదేహాలు లభ్యమైనట్లు కలెక్టర్ విజయరామరాజు ప్రభుత్వానికి నివేదించారు. ఆదివారం సాయంత్రానికి మరికొన్ని మృతదేహాలు బయటపడినట్లు తెలుస్తోంది. మరోవైపు రాయచోటి సమీపంలోని మాండవ్య నదిలో గల్లంతైన అక్కా, తమ్ముడి మృతదేహాలను వెలికితీశారు. మృతులను సాజియా(19), కుమారుడు జాసిన్(12)గా గుర్తించారు. కడప– అనంతపురం ప్రధాన రహదారిలో కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. కడప రాధాకృష్ణనగర్ ప్రాంతంలో పురాతన రెండతస్తుల భవనం ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలింది. చిత్తూరు జిల్లావ్యాప్తంగా వరదల ఉదృతికి 8 మంది మృతి చెందారు. చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయులు 500 ఏళ్ల క్రితం నిర్మించిన రాయల చెరువుకు లీకేజ్ కారణంగా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం జిల్లాలో నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో వాగులు, వంకలు పోటెత్తాయి. పోటెత్తిన పెన్నా.. నెల్లూరు జిల్లాలో బీభత్సం నెల్లూరు జిల్లాలో పెన్నా నది పొటెత్తడంతో పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. నెల్లూరు సమీపంలోని చెన్నై–కోల్‌కతా ఏషియన్ హైవే–16 జాతీయ రహదారికి శనివారం అర్ధరాత్రి పలుచోట్ల గండ్లుపడ్డాయి. పెన్నా వరద ఉధృతికి హైవే కొట్టుకుపోయి శనివారం అర్ధరాత్రి నుంచి ఇరువైపులా సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. పడుగుపాడు వద్ద పెన్నా వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోవడంతో పట్టాలు నీటి ఉధృతిలో వేలాడుతున్నాయి. దీంతో విజయవాడ– నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. మరో పది రైళ్లను దారి మళ్లించారు. నెల్లూరు వెంకటేశ్వరపురం సాలుచింతల వద్ద పాలిటెక్నిక్ విద్యార్థి గోపి వరద నీటిలో చిక్కుకుని మృతి చెందాడు. కాగా, సోమశిల జలాశయం వెలుపలి వైపు రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. -
ముందడుగు
-
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు