breaking news
west rayalaseema
-
'ఓట్ల లెక్కింపులో అక్రమాలు చూపినా ఆర్ఓ పట్టించుకోలేదు'
అనంతపురం క్రైం: ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ), కలెక్టర్ నాగలక్ష్మి పట్టించుకోలేదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం దేనికి సంకేతం అని ప్రశి్నంచారు. పైగా వారు తమకు పడ్డ ఓట్లను సైతం తగ్గించి చూపించారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని చూసి చాలా బాధేసిందన్నారు. ‘కౌంటింగ్ నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ పూర్తిగా వైఫల్యం చెందారు. టీడీపీకి అనైతికంగా మద్దతుగా నిలి్చన వీరిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్, కమలాపురం ఇన్చార్జ్ నరసింహారెడ్డి, పులివెందులకు చెందిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆలం నరసానాయుడు, వడ్డే మురళీ, సరిపూటి రమణ.. ఇలా పది మందికిపైగా టీడీపీ ముఖ్య నేతలు ఏజెంట్లుగా కూర్చున్నప్పటికీ ఆర్ఓ పట్టించుకోలేదు. వీరు కౌంటింగ్ హాల్లోని ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ప్రభావం చూపేలా వ్యవహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కౌంటింగ్ హాలులో పదుల సంఖ్యలో, పరిసర ప్రాంతాల్లో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేసినా ఎస్పీ ఫక్కీరప్ప ప్రేక్షక పాత్ర పోషించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే కలెక్టర్ నాగలక్షి్మ, ఎస్పీ ఫక్కీరప్పలు ఏవిధంగా మాట్లాడారు? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయాన్ని మరచిపోయారా? ► కౌంటింగ్ హాల్లో టేబుల్ నంబర్ 19లో ఓ అధికారి టీడీపీ అభ్యర్థివి 44, మా పార్టీవి ఆరు ఓట్లు కట్టకట్టి ఒకే దానిలో వేశారు. దీనిపై మా ఏజెంట్ ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. ► అదే అధికారి 3, 4, 5 రౌండ్లలోనూ ఉన్నాడని ఫిర్యాదు చేస్తే తనకేం సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి చెప్పడమేంటి? అక్రమాలు జరిగినప్పుడు విచారణ చేయకపోతే ఆర్ఓగా ఎందుకున్నట్లు? మరో అధికారి.. తమవి 70 ఓట్లు ఉంటే ఆ కట్టపై 50 అని రాశారు. టీడీపీవి 30 ఉంటే 50 అని నమోదు చేశారు. ► ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అవకతవకలు
-
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో వివాదం
సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో వివాదం నెలకొంది. ఇండిపెండెంట్ల ఓట్లను కౌంటింగ్ సిబ్బంది టీడీపీ ఖాతాలో కలిపారంటూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. అనంతరం కౌంటింగ్ సిబ్బంది అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సిబ్బందిని టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్‌లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు. -
పశ్చిమ రాయలసీమ ‘పట్టభద్రుల’ కౌంటింగ్‌పై అనుమానాలు
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పలు అనుమానాలకు తావిచ్చింది. టీడీపీ నేతల ప్రలోభాలతో కొందరు ఉద్యోగులు వైఎస్సార్సీపీ ఓట్లను టీడీపీ బాక్సుల్లో వేస్తున్నారని వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కౌంటింగ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆరు ఓట్లను టీడీపీ బాక్సుల్లో ఒక ఉద్యోగి వేయడం అనుమానాలకు తెరలేపింది. దీనిపై రీకౌంటింగ్ చేయాలని అనంతపురం జాయింట్ కలెక్టర్ కేథన్‌గార్గ్‌కు లిఖిత పూర్తకంగా వినతి ప్రతం అందజేశారు రవీంద్రారెడ్డి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా వెర్రి తలలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా పైశాచిక ఆనందం పొందుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా లెక్కింపు జరిగినట్లు రోత రాతలు రాస్తోంది. పట్టభద్రల ఓట్లన్నంటినీ కలిపి లెక్కిస్తున్నప్పటికీ జిల్లాలు, నియోజకవర్గాల వారిగా లెక్కింపు జరుగుతుందని అసత్యపు రాతలు రాస్తోంది. పులివెందులలో టీడీపీ మెజారిటీ అంటూ పచ్చ మీడియా తన పైత్యాన్ని మరోసారి బయటపెట్టింది. వాస్తవాన్ని వక్రీకరించి ఎల్లో మీడియా వికృత ప్రచారానికి దిగింది. -
‘వెన్నపూస’ విజయకేతనం
– మండలి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి – టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిని ఎలిమినేట్ చేసి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన అధికారులు – వెన్నపూసకు ‘మ్యాజిక్ ఫిగర్’ కంటే 223 ఓట్ల ఆధిక్యత...టీడీపీ అభ్యర్థిపై 14,367 ఓట్ల మెజార్టీ –పార్టీ అభ్యర్థి గెలుపుతో కదనోత్సాహంలో వైఎస్సార్సీపీ శ్రేణులు – ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలే రెఫరెండం అంటున్న పార్టీ నేతలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) అందరూ అనుకున్నట్లే జరిగింది. పట్టభద్రులు ‘ఓటెత్తిన’ చైతన్యంతో వైఎస్సార్సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్‌లో తొలిరౌండ్ నుంచి నిలకడైన ఆధిక్యత ప్రదర్శించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. పెద్దలసభలో ఆయన సగర్వంగా అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ తమకు బలమైన జిల్లాగా భావిస్తున్న అనంతపురం నుంచి, అందులోనూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో ‘అనంత’తో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లా వాసుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో వైఎస్సార్సీపీపై గట్టి నమ్మకం ఉంచారన్న విషయాన్ని ఈ ఎన్నికలు సుస్పష్టం చేస్తున్నాయి. గోపాల్‌రెడ్డి గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 20న మొదలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి ప్రతి రౌండ్లోనూ గోపాల్‌రెడ్డి నిలకడగా ఆధిక్యత ప్రదర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆరు రౌండ్లలో 53,714 ఓట్లు దక్కించుకున్నారు. అప్పటికి తన సమీప ప్రత్యర్థి కేజేరెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే విజయానికి అవసరమయ్యే ‘మ్యాజిక్ ఫిగర్’ 67,887. దీని కంటే 14,173 ఓట్లు తక్కువ రావడంతో ఎన్నికల అధికారులు మంగళవారం ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. బరిలోని 25మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు పోలైన వారి నుంచి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. వారి ఓట్లను ఇతర అభ్యర్థులకు జత పరుస్తూ వచ్చారు. గోపాల్‌రెడ్డి, కేజేరెడ్డి, గేయానంద్ మినహా తక్కిన 23 మంది అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓట్లు 8,239 పోలయ్యాయి. ఎలిమినేషన్లో ఈ ఓట్లలో 23వ రౌండ్ ముగిసే సరికి గోపాల్‌రెడ్డికి మరో 1,771 లభించాయి. ఆపై 23వ రౌండ్లో గేయానంద్‌ను ఎలిమినేట్ చేశారు. ఆయనకు లభించిన మొత్తం 34,910 (22వ రౌండ్ పూర్తయ్యే సరికి) ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యతను లెక్కించారు. ఇందులో 10,798 ఓట్లు గోపాల్‌రెడ్డికి దక్కాయి. ఇవి కలిపి గోపాల్‌రెడ్డికి వచ్చిన ఓట్ల సంఖ్య 66,283కు చేరింది. అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కు 1,827 ఓట్ల దూరంలో నిలిచారు. దీంతో చివరకు టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు పోలైన ద్వితీయ ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యత ఓట్లను 24వ రౌండ్‌గా అధికారులు లెక్కించారు. ఈ ప్రక్రియలో ఒక్కో టేబుల్ పరిధిలోని ఓట్లు లెక్కిస్తూ మ్యాజిక్ ఫిగర్‌కు గోపాల్‌రెడ్డి చేరువయ్యారా, లేదా అని అధికారులు పరిశీలిస్తూ వచ్చారు. కొన్ని టేబుళ్లలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గోపాల్‌రెడ్డికి పోలైన ఓట్లను పరిశీలించగా 68,110కి చేరాయి. ఆయన విజయానికి అవసరమైన ఓట్లు 67,887 మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కంటే 223 ఓట్లు ఎక్కువ లభించడంతో ఎన్నికల అధికారులు గోపాల్‌రెడ్డి విజయాన్ని ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు గోపాల్‌రెడ్డి గెలిచినట్లు బుధవారం ఉదయం ఆరు గంటలకు అధికారులు ప్రకటించారు. ప్రకటన వెలువడగానే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గోపాల్‌రెడ్డిని అభినందించారు. ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. ఆపై రిటర్నింగ్ అధికారి కోన శశిధర్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. తర్వాత పార్టీ నేతలంతా ఆనందోత్సాహాల మధ్య గోపాల్‌రెడ్డిని భుజాలపై ఎత్తుకుని ర్యాలీగా బయటకు వచ్చారు. అప్పటికే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పార్టీ కార్యకర్తలు భారీగా వేచివున్నారు. గోపాల్‌రెడ్డి బయటకు రాగానే పూలమాలలు వేసి అభినందించారు. ‘జై జగన్’.. ‘జోహార్ వైఎస్సార్’ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి ర్యాలీగా వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై పార్టీ కార్యాలయానికి వెళ్లి సంబరాలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. టీడీపీకి కోలుకోలేని దెబ్బ గోపాల్‌రెడ్డి అనంతపురం జిల్లా వాసి. జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో 2 ఎంపీలతో పాటు 12 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ గెలిచింది. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాను ప్రలోభపెట్టి సైకిలెక్కించారు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన 8మంది ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పారు. ఈ క్రమంలో మెజార్టీ ఎమ్మెల్యేలు, అధికార అండతో మండలి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ భావించింది. అయితే.. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష పార్టీ పనితీరును బేరీజు వేస్తూ తీర్పు ఇచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. టీడీపీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. నెలకిందట సీఎం చంద్రబాబు పిలిచి జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని హెచ్చరించారు. ఈ మాటలను నిజం చేసేలా ఓటర్లూ తీర్పు ఇచ్చారు. ఈ విజయంతో వైఎస్సార్సీపీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగబోయే సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆపై జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.