నిరుద్యోగంలో మూడో స్థానంలో ఏపీ | AP ranks third in unemployment in Chandrababu Govt Rule | Sakshi
Sakshi News home page

నిరుద్యోగంలో మూడో స్థానంలో ఏపీ

Sep 1 2025 4:55 AM | Updated on Sep 1 2025 9:14 AM

AP ranks third in unemployment in Chandrababu Govt Rule

ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌ వరకు లేబర్‌ సర్వే నివేదికలో వెల్లడి

రాష్ట్రంలో నిరుద్యోగిత 21 శాతం.. జాతీయ స్థాయిలో 14.6 శాతమే

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్ర­బాబు పాలనలో రాష్ట్రం భారీ అప్పు­లతోపాటు  నిరుద్యో­గ­ంలోనూ దూసు­కు­పో­తోంది! దేశవ్యాప్తంగా నిరు­ద్యో­గంలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచి­నట్లు లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 29 ఏళ్ల లోపు యువతీ యువకుల్లో నిరుద్యోగిత 21.0 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 

జాతీయ స్థాయిలో నిరుద్యోగ యువత కేవలం 14.6 శాతమే ఉండగా, రాష్ట్రంలో అంతకు మించి ఉండటం గమనార్హం. ఏపీలో నిరుద్యోగ యువ­కులు 17.9 శాతం కాగా.. యువతులు 28.5 శాతం. అదే జాతీయ స్థాయిలో నిరుద్యోగ యువకులు 14.1 శాతం, యువతులు 16.0 శాతంగా ఉంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 19.9 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 23.1 శాతంగా ఉంది. 

భృతి ఎగ్గొట్టారు... జాబులూ లేవు
నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానంటూ మాట మార్చేశారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయం లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో వెల్లడైంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement