
ఎన్టీఆర్ జిల్లాలో ఫోన్లు స్వాదీనం
ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు తీవ్రస్థాయిలో వేధిస్తున్నారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో గురువారం వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలైన మేడపాటి నాగిరెడ్డి, మైలవరం నియోజవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు ఇంటికి సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లారు.
ఇద్దరి ఇళ్లల్లో సోదాలు చేయడానికి ప్రయత్నించారు. దీన్ని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం వీరి ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకుని సీజ్ చేశారు. వాట్సాప్‌లో చాటింగ్ ఆధారంగా ఇద్దరి నేతలను అరెస్ట్ చేయవచ్చనే అనుమానాలు స్థానిక నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.