ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | AP Local Body Elections 2026 Schedule Announced | Sakshi
Sakshi News home page

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Oct 14 2026 3:26 PM | Updated on Oct 14 2026 4:24 PM

AP Local Body Elections 2026 Schedule Announced

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా మున్సిపల్‌, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేశారు. ఏపీలోని 13 నగరపాలక సంస్థలు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. మూడు దశల‍్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల‍్లోకి వచ్చింది.

మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

అక్టోబరు 14 నోటిఫికేషన్‌

ఎన్నికలు 28న

30వ తేదీన ఫలితాలు 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌

ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబరు 19న నోటిఫికేషన్‌

ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నవంబరు 3న పోలింగ్‌

నవంబర్‌ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

గ్రామ పంచాయతీ షెడ్యూల్‌

నవంబర్‌ 13- తొలి దశ నోటిఫికేషన్‌ 

నవంబర్‌ 26- తొలి దశ పోలింగ్‌, కౌంటింగ్‌ 

నవంబర్‌ 16- రెండో దశ నోటిఫికేషన్‌ 

నవంబర్‌ 29- రెండో దశ పోలింగ్‌, కౌంటింగ్‌ 

నవంబర్‌ 19- మూడో దశ నోటిఫికేషన్‌ 

డిసెంబర్‌ 2- మూడో దశ పోలింగ్‌, కౌంటింగ్‌

LIVE: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement