ఆంధ్రప్రదేశ్: విజయవాడలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లతో పాటు జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది.
అయితే, డెడికేషన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జెడ్పీ, ఎంపీపీ, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు నిబంధనలను నిర్దేశించింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుపై తదుపరి ప్రక్రియకు మార్గం సుగమం కానుంది.
ఇదీ చదవండి: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు


