AP: ప్రభుత్వ ‘కారుణ్యం’  | ap: job for one of the families of employees who died of covid-19 | Sakshi
Sakshi News home page

AP: ప్రభుత్వ ‘కారుణ్యం’ 

Oct 14 2023 5:12 AM | Updated on Oct 14 2023 10:17 AM

ap: job for one of the families of employees who died of covid-19 - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కారుణ్యం చూపుతోంది. కోవిడ్‌తో 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందగా.. వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున కారుణ్య నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. గతంలోనే కారుణ్య నియామకాల కోసం 2,744 మంది దరఖాస్తు చేసుకోగా 1,488 మందికి ఉద్యోగాలను కల్పించింది.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఉద్యోగికి మైనర్‌ పిల్లలు ఉంటే వయసు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కోసం 330 దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో 241 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. వీటిలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా 164 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మిగతా 77 మంది అర్హత గల కుటుంబాల్లోని వారికి వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్‌ రెడ్డి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అందరూ ఉద్యోగాల్లో చేరిన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచాల్సిందిగా సీఎస్‌ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement