Corona Virus: ఏపీలో కొత్తగా 186  కరోనా కేసులు | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 186  కరోనా కేసులు

Dec 4 2021 6:35 PM | Updated on Dec 4 2021 6:49 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 32,036 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 186 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి ముగ్గురు  మృత్యువాతపడ్డారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,448 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 191 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 20 లక్షల 56 వేల 979 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,149 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,73,576 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 3,05,39,041 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement