Corona Virus: ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు

Oct 1 2021 6:04 PM | Updated on Oct 1 2021 6:12 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 809 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 10  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14186 కు చేరింది. 

ఒకరోజులో 1,160  మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 11,142 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,51,133 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,83,50,167 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,25,805 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

చదవండి: వైరల్‌: కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకొని.. బిల్లు చూసి షాకయ్యాడు..

Advertisement
 
Advertisement
Advertisement