Covid - 19 Update : 1,084 New Corona Positive Cases Recorded In Last 24 Hours - Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 1,084  కరోనా కేసులు

Sep 29 2021 6:00 PM | Updated on Sep 30 2021 4:58 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 57,345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,084 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,163 కు చేరింది. 

ఒకరోజులో 1,328  మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 11,655 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,49,314కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,23,496 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

చదవండి: కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement