Corona Virus: ఏపీలో కొత్తగా 1,520  కరోనా కేసులు | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 1,520  కరోనా కేసులు

Sep 3 2021 6:15 PM | Updated on Sep 27 2021 4:15 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 64,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,520 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 10  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,887 కు చేరింది. 

గత 24 గంటల్లో 1,290 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,922 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2018200 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,68,09,774  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: viral diseases: నిండిపోతున్న పిల్లల వార్డులు, ఆందోళనలో పేరెంట్స్‌

Advertisement
 
Advertisement
Advertisement