viral diseases: నిండిపోతున్న పిల్లల వార్డులు, ఆందోళనలో పేరెంట్స్‌

viral diseases Panic grips as more than 400 admitted in Lucknow hospitals - Sakshi

పిల్లల్లో పెరుగుతున్న కేసులు, నిండిపోతున్న పీడియాట్రిక్స్  విభాగం

 40 మంది పిల్లలతో సహా, 400 పైగా రోగులు ఆస్పత్రిలో

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అంతుచిక్కని, విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ వైరల్‌ ఫీవర్స్‌తో ఇప్పటికే చాలామంది ఆసుపత్రుల పాలవ్వగా రాజధాని నగరం లక్నోలో పలు  ఆసుపత్రులు రోగులతో కిటకిట లాడు తున్నాయి. 40 మంది పిల్లలు సహా, 400 మందికి పైగా చేరడం ఆందోళన రేపుతోంది.

ఉత్తరప్రదేశ్‌లో గత వారం రోజుల్లో వైరల్ జ్వరాల పీడితుల సంఖ్య 15 శాతం పెరిగింది. వాతావరణ మార్పులతో వస్తున్న సాధారణ ఫ్లూ అని అందోళన అవసరం లేదని వైద్యులు చెబుతునప్పటికీ, కేసుల సంఖ్య ఆకస్మికంగా పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతుండటం తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలైంది. నగరంలోని బలరాంపూర్ సివిల్ ఆసుపత్రి, లోహియా ఇన్స్టిట్యూట్‌లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వీటితోపాటు  మహానగర్ భౌరావ్ దేవరాస్, రాణి లక్ష్మీబాయి, లోక్‌బంధు, రాంసాగర్ మిశ్రా, మ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా జ్వర పీడితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

ముఖ్యంగా పీడియాట్రిక్స్ విభాగంలో బాధితులు క్యూ కడుతున్నారు. అలాగే పాథాలజీలో, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వైరల్ జ్వరం, ఇతర సంబంధిత వ్యాధుల కేసులలో 20 శాతం పెరుగుదల కనిపిస్తోందని సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ ఎస్‌కె నందా తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top