Corona Virus: ఏపీలో కొత్తగా 1,378  కరోనా కేసులు | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 1,378  కరోనా కేసులు

Sep 2 2021 5:02 PM | Updated on Sep 3 2021 5:16 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 59,566 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,378 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 10  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,877 కు చేరింది. 

గత 24 గంటల్లో 1,139 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,88,101 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,702 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,16,680 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,67,45,035  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: జాతీయ మెడికల్‌ కమిషన్‌  కీలక నిర్ణయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement