Covid - 19 Update : 1,869 New Covid Positive Cases Recorded In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 1,869  కరోనా కేసులు

Aug 11 2021 3:57 PM | Updated on Aug 13 2021 4:54 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో  71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,582 కు చేరింది. 

గత 24 గంటల్లో 2,316 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,55,052 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 18,417 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 198,57,051 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,53,82,763 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement